యూపీ లో ప్రియాంకకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Update: 2019-10-03 06:50 GMT
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఉంది కాంగ్రెస్ పరిస్థితి. నరేంద్ర మోడీ దెబ్బకు ఇప్పటికే దేశవ్యాప్తంగా కుదేలైన కాంగ్రెస్ పార్టీకి ఇంకా వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నా అనుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ ని మోసం చేస్తుంటే ఏం చేయాలో తెలీక కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడానికి రాహుల్ నిరాకరించిన సమయంలో కూడా ధైర్యంగా  నిలబడిన ప్రియాంక గాంధీ ఇప్పుడు తన సన్నిహితురాలు, రాయ్ బరేలి ఎమ్మెల్యే అదితి సింగ్ చేసిన పని ప్రియాంకకి షాక్ ఇచ్చింది.

బుధవారం మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్కడి ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. అయితే ఈ సమావేశాలను ప్రతిపక్షాలన్నీ బహిష్కరించాయి. అంతేకాకుండా ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్నోలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కనిపించారు కానీ ప్రియాంక గాంధీ సన్నిహితురాలు అదితి సింగ్ మాత్రం ఈ ర్యాలీ కి డుమ్మా కొట్టి అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వడంతో కాంగ్రెస్ నాయకులంతా ఆశ్చర్యపోయారు. దీంతో అదితి సింగ్ త్వరలోనే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. కానీ అదితి సింగ్ మాత్రం తనకు పార్టీ మారే ఆలోచన ఏం లేదని అంటున్నారు.

    

Tags:    

Similar News