ఫిరాయింపుల‌పై ఆందోళ‌న‌... ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ద్ద కాంగ్రెస్ ఆందోళ‌న‌

Update: 2019-03-03 12:06 GMT
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ పార్టీకి షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తాజాగా ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ నేప‌థ్యంలో సీఎల్పీ అత్యవసర భేటీ ఏర్పాటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సహా 15 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఇద‌ద్ద‌రు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్ట‌డం కాంగ్రెస్ శ్రేణుల‌ను ఆందోళ‌నకు గురి చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు పార్టీని వీడుతున్నామని ప్రకటించారు. తాజా స‌మావేశానికి మిగిలిన 17మందిలో పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి గైర్హాజరయ్యారు. రోహిత్‌ రెడ్డి చెన్నైలో ఉండగా.. ఉపేందర్‌ రెడ్డి అనారోగ్య కారణంతో పార్టీకి హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అత్య‌వ‌స‌ర స‌మావేశానికి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు గైర్హాజ‌రు అవ‌డం చ‌ర్చ‌నీయంగా మారింది.ఇదిలాఉండ‌గా, ఫిరాయింపుల‌ను నిర‌సిస్తూ, ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ద్ద ఆందోళ‌న చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు సమాచారం.

మ‌రోవైపు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఈ స‌మావేశం సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎల్పీ భేటీ నుంచి మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వచ్చిన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకత్వంతోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుంటే జోష్ రావడం లేదని అన్నారు.  నాయకత్వాన్ని మార్చాలని హైకమాండ్‌ ను కోరుతున్నానని.. నాయకత్వాన్ని మారిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 8 సీట్లు గెలుచుకుంటామని అన్నారు. తన నియోజకవర్గంలో ప్రధాన నాయకుడు మరణించడంతోనే సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోతున్నానని వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News