తెలంగాణలో ప్రచార హోరు జోరందుకుంది. మైకులు దద్దరిల్లేలా నాయకుల ప్రసంగాలతో దుమ్మురేపుతున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అధికార టీఆర్ ఎస్ సంక్షేమ పథకాలే తమ కంటి వెలుగని ఆశలు పెట్టుకుంటే.. మహాకూటమి - బీజేపీ మాత్రం కేసీఆర్ కుటుంబం పై వ్యక్తిగత విమర్శలే అస్త్ర్రాలుగా సంధిస్తోంది. సందట్లో సడేమియా మాదిరిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తానే హైదరాబాద్‌ను నిర్మించానని - ప్రపంచ పటంలో పెట్టానని తన డబ్బా రీల్ ను మరోసారి తిప్పుతున్నారు.
బుధవారం తెలంగాణలోని ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో బహిరంగ సభా వేదికను చంద్రబాబు పంచుకున్నారు. ఇదేదో దేశోద్ధారణ కోసం తాను కంకణం కట్టుకున్నట్లు ముందుగానే ఆయన చెప్పుకొచ్చారు. 30 ఏళ్లపై సంధి కాంగ్రెస్ పార్టీ పేరు వింటేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు - నేతలు నిప్పులు కక్కుతుంటారు. ఇలాంటి సమయంలో కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి తననెవరూ చూడలేదనుకున్న చందంగా.. చంద్రబాబు తన అవకాశవాద రాజకీయాలను ఎవరూ గమనించడం లేదని భ్రమ పడుతున్నారు. అందుకే రాహుల్ గాంధీతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు.
కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ ఏమి మిగిల్చిందని వస్తున్నారండీ.. విభజన కత్తితో పొడిచి గాయం ఎలా ఉందని చూడడానికి వస్తున్నారా? లేదా మళ్లీ పుండు మీద కారం చల్లుదామని వస్తున్నారా ? అంటూ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా వీరిద్దరూ కలిసి తెలంగాణ ప్రజలకు ఎన్నికల సందేశం ఇచ్చారు.. వైరి వర్గాలు ఒకే వేదికగా తమను గెలిపించడని పిలుపునిస్తే ఎవరి మాటలు నమ్మాలో.. ఎవరి ప్రసంగాలు నమ్మకూడదో అర్థంగాక ప్రజలు డీలా పడిపోయారు. ఇదే సమయంలో మహాకూటమిలోని ఇతర పార్టీలు మాత్రం చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారం చేయడం∙తమకే నష్టమని వాపోతున్నాయి.
ప్రత్యేక తెలంగాణ పోరాట సమయంలో అనేక దఫాలుగా చంద్రబాబు నాలుక మడతేసిన విషయాన్ని ఈ సందర్భంగా అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అటు తెలంగాణంలో జై తెలంగాణ అని, ఇటు ఆంధ్రప్రదేశ్ లో జై సమైక్యాంధ్ర అని రెండు నాల్కల ధోరణి అవలంభించడంతో అప్పట్లో తెలంగాణ ప్రజలు ఛీకొట్టారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ ఎస్ కు కాస్తా కూస్తో పోటీ ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే.. ఇలాంటి సందర్భంలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభను పంచుకోవడం పెళ్లికి వెళతా పిల్లిని చంకంలో పెట్టుకోవడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు తన సొంత డబ్బా కొట్టుకోవడంతో వేదికపై ఉన్న రాహుల్ గాంధీతోపాటు ఇతర పార్టీల నేతలు అవాక్కవడం వారి వంతైంది. ఇకపై బాబుతో ఇలాగే ప్రచారం నిర్వహిస్తే తమ గొయ్యి తామే తీసుకున్న చందంగా పరాజయాన్ని మూటగట్టుకోక తప్పదని మేధావులు స్పష్టం చేస్తున్నారు.