కాంగ్రెస్ అస్త్రాలుగా ప్రియాంక పాత ఫోటోలు!

Update: 2019-01-25 04:54 GMT
అవ‌కాశం ఉన్న‌ప్పుడు పూర్తిస్థాయిలో వాడేసుకోవ‌టం తెలివైనోళ్ల ప‌ని. ఇప్పుడు అదే ప‌ని చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. త‌న తురుపు ముక్క‌.. బ్ర‌హ్మాస్త్రంగా భావిస్తున్న ప్రియాంక గాంధీని క్రియాశీల రాజ‌కీయాల్లోకి తీసుకొస్తున్న నేప‌థ్యంలో.. ఆమె ఇమేజ్ ను పెంచేందుకు ఉన్న అన్ని అవ‌కాశాల్ని వాడేసే ప్ర‌య‌త్నాన్ని షురూ చేశారు.

స్మార్ట్ ఫోన్ విప్ల‌వంతో ప్ర‌తి ఒక్క‌రి చేతిలోకి వ‌చ్చేసిన ఫోన్ తో ప్రియాంక‌ను అంద‌రికి చేరువ‌య్యేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. సోష‌ల్ మీడియాతో భావోద్వేగాన్ని ర‌గిలించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా గాంధీ ఫ్యామిలీలో పెద్ద ఎత్తున ఇమేజ్ ఉన్న ఇందిర‌మ్మ పోలిక‌లెన్నో ప్రియాంకలో ఉన్న‌ట్లుగా చెప్పే ఫోటోల‌తో పాటు.. తండ్రి రాహుల్ తో ఆమెకున్న అనుబంధాన్ని తెలియ‌జేసే ఫోటోల్ని తెర మీద‌కు తీసుకొస్తున్నారు.

తాజాగా ఇన్ స్టాగ్రామ్‌ లో కాంగ్రెస్ పార్టీ ఒక ఫోటోను పోస్ట్ చేసింది. 40 ఏళ్ల క్రితం నాన‌మ్మ ఇందిర‌మ్మ‌తో క‌లిసి ప్రియాంక స‌ర‌దాగా ఆడుకుంటున్న ఫోటోను బ‌య‌ట‌పెట్టారు. త‌మ ఇంటి ఆవ‌ర‌ణ‌లో నాన‌మ్మ‌తో ఒప్పుల‌కుప్ప ఆడుతున్న ప్రియాంక చిన్న‌నాటి ఫోటోను పోస్ట్ చేయ‌టం ద్వారా ఇందిరాగాంధీతో ఆమెకున్న అనుబంధాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. ఈ త‌ర‌హా ఫోటోల‌తో భావోద్వేగాల్ని ర‌గిలించ‌టంతో పాటు .. దేశ ప్ర‌జ‌ల‌ను ఇట్టే ఆక‌ట్టుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

ఫ్యామిలీ అల్బ‌మ్ నుంచి తీసిన ఫోటోల‌ను ప్ర‌త్యేకంగా పోస్ట్ చేయ‌టం చూస్తే.. దేశ ప్ర‌జ‌ల్లో ఇందిర‌మ్మ‌.. రాజీవ్ ల‌కున్న ఇమేజ్ ను ప్రియాంక‌కు బ‌దిలీ చేసేందుకు కాంగ్రెస్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా ఇన్ స్ట్రాగ్రామ్‌ లో పెట్టిన హెడ్డింగ్ కూడా బ‌లం చేకూరేలా ఉంద‌ని చెప్పాలి. నాన‌మ్మ‌లానే మ‌న‌మ‌రాలు కూడా.. అన్న శీర్షిక‌తో పాటు.. శ‌క్తివంతులైన మ‌హిళ‌లు త‌మ‌లా శ‌క్తిసంప‌న్నుల‌నే ప్రోత్స‌హిస్తారంటూ పేర్కొన్నారు. మొత్తంగా గాంధీ ఫ్యామిలీలోని ప్ర‌ముఖుల‌తో ప్రియాంక‌కు ఉన్న అనుబంధాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపేలా ఫోటోల‌తో ప్ర‌చారాన్ని మోతెక్కించ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. 



Tags:    

Similar News