జ‌గ‌న్ స‌ర్కారుకు కాంట్రాక్ట‌ర్ల దెబ్బ‌.. సిండికేట్ అవుతున్నారే!

Update: 2021-11-16 00:30 GMT
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. ఒక ఆస‌క్తిక‌ర‌మైన ప‌దం తెర‌మీదికివ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు టెండ‌రింగ్ అన్న‌మాటే వినిపించిన ఏపీలో `రివ‌ర్స్ టెండ‌రింగ్‌` అనే మాట‌ను సీఎం జ‌గ‌న్ వినిపించారు. అప్ప‌టి వ‌ర‌కు టీడీపీ హ‌యాంలో పెద్ద ఎత్తున జ‌రిగిన కాంట్రాక్టుల్లో.. భారీ ఎత్తున ప్ర‌జాధ‌నాన్ని కొల్ల‌గొట్టార‌ని సో.. ఆయా కాంట్రాక్టుల‌ను తిర‌గ‌దోడి.. లూటీ అయిన ప్ర‌జాధ‌నాన్ని రాబ‌డ‌తామ‌ని.. సీఎంగా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలోనే అనేక కాంట్రాక్టుల‌కు మ‌ళ్లీ రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వ‌హించి.. బాగానే డ‌బ్బులు రాబ‌ట్టారు. అయితే.. ఇది ఇప్పుడు రివ‌ర్స్ అయింది. ప్ర‌భుత్వం రెండేళ్లుగా చేస్తున్న ఈ రివ‌ర్స్‌తో విసిగిపోయారో.. ఏమో.. కాంట్రాక్ట‌ర్లు.. ఇప్పుడు.. ఏక‌మ‌య్యారు(సిండికేట్‌).

వైసీపీ సర్కార్ హయాంలో తొలుత పనులు పొందిన వారికి సైతం బిల్లులు సకాలంలో రాకపోవడం, ప్రభుత్వానికి సరఫరా చేసిన సామాగ్రి బిల్లులు క్లియర్ కాక, కోర్టులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుండటం, ఇతరత్రా కారణాలతో కాంట్రాక్టర్లు ఇప్పుడు ఏకమై పోతున్నారు.

తాజాగా రోడ్ల కాంట్రాక్టులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా డబ్బులు రావన్న అనుమానాలతో చాలా మంది వాటికి దూరంగా ఉండిపోయారు. చివరికి ఇంజనీర్లు బతిమాలుకుని ఒకరిద్దరిని దారికి తెచ్చుకుని పనులు పూర్తి చేశారు. కానీ మెజారిటీ కాంట్రాక్టర్లు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోతున్నారు. ఈ ప‌రిణామాలు.. ప్ర‌భుత్వానికి తీవ్ర ఇబ్బందులు తీసుకువ‌స్తున్నాయి.

రాష్ట్రంలో కీల‌క‌మైన‌ ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొగ్గు సరఫరా విషయంలో కాంట్రాక్టర్లు ఏకమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి ముందు ఓ రేటు ఇచ్చి ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ నిర్వహించినా కనీస మొత్తం తగ్గించి ఈ రేటుకు కొనాల్సిందేనని చెప్తున్నారు.

దీంతో ఏపీ జెన్ కో ఇప్పుడు విదేశీ బొగ్గును ఆ ధరకు కొనలేక, అలాగని కొనకుండా ఉండలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చివరికి ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చేతుల్లో పెట్టేసింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే విదేశీ బొగ్గు కొనుగోలు ధర నిర్ణయం కానుంది.

ప్రస్తుతం విదేశీ బొగ్గును టన్ను 6-7 వేలకు ప్రభుత్వం కొంటోంది. దీన్ని ఇప్పుడు రూ.17,540 చొప్పున అమ్ముతామని ప్రభుత్వానికి కాంట్రాక్టు సంస్ధలు తేల్చిచెప్పాయి. వాస్తవానికి ముందు టెండర్లలో రూ.19500 చెప్పిన రేటును రివర్స్ టెండరింగ్ లో రూ.17540కి తగ్గించాయి.

అలా అయినా ప్రభుత్వం మూడొంతులు ఎక్కువగా రేటు పెట్టి కొనాల్సిన పరిస్ధితి. ఇప్పుడు కొంటున్న రేటు ప్రకారం చూస్తే విద్యుత్ యూనిట్ రేటు రూ.4కి అమ్మాల్సి వస్తోంది. ఇది.. సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. ఎందుకంటే.. ఇప్ప‌టికే విద్యుత్ ధ‌ర‌లు పెరిగి.. ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మూడొంతులు ఎక్కువగా ధరపెట్టి విదేశీ బొగ్గు కొనుగోలు చేస్తే ఆ మేరకు వినియోగదారులకు యూనిట్ రూ.12కు అమ్మాల్సి వస్తుంది. అది ఎట్టి పరిస్దితుల్లోనూ అసాధ్యం. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది.

అలాగని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయలేక వాటిని నిలిపేస్తే కరెంటు కోతలు తప్పవు. దీంతో ఇప్పుడు బొగ్గు కొరత ఉన్నా, ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపేస్తున్నా అలాగే నెట్టుకొస్తోంది. ఆలోపు కాంట్రాక్టర్లతో లాబీయింగ్ కు ప్రయత్నిస్తోంది. ఏదేమైనా.. రివ‌ర్స్ టెండ‌రింగ్‌.. ప్ర‌భుత్వానికి రివ‌ర్స్ కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.


Tags:    

Similar News