ప్రపంచ వ్యాప్తంగా అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఇలాంటివేళలోనూ కొన్ని మినహాయింపులు ఉన్న దేశాలు.. దీవులు కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు కరోనా దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకున్న చిన్ని చిన్ని దేశాలు కొన్ని ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాని ఈ బుజ్జి దేశాల్లోనూ ఇప్పుడు కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితి.
కోవిడ్ నిబంధనల్ని పక్కాగా పాటించటంతో పాటు.. మరిన్ని ముందస్తు జాగ్రత్తల కారణంగా సమోవా.. టోంగా.. నౌరు.. మార్షల్ దీవుల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇలాంటివేళ.. అలాంటి అరుదైన పేరును మార్షల్ దీవులు పోగొట్టుకుంది. తాజాగా ఆ చిన్ని దేశంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ తీవ్ర రూపం దాల్చిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులంటూ నమోదు కానీ దేశాల్లోనూ తొలిసారి కేసులు నమోదు కావటానికి కారణం.. విదేశాల నుంచి వచ్చిన వారి పుణ్యమే. మార్షల్ దీవుల్లో తొలిసారి పాజిటివ్ కేసులు నమోదైన ఇద్దరూ అమెరికాకు చెందిన మిలటరీ బేస్ లో పని చేసే ఉద్యోగులు. వీరిద్దరూ ఒకే ప్రాంతం నుంచి మార్షల్ దీవులకు చేరినట్లుగా గుర్తించారు.
అమెరికాలోని హవాయి ప్రాంతం నుంచి అక్టోబరు 27న మార్షల్ దీవులకు వచ్చారు. అయితే.. కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల.. వారిద్దరిని ఒక చోట ఉంచటంతో..వీరిద్దరికి పాజిటివ్ అయినప్పటికీ వేరే వారికి సోకకుండా జాగ్రత్త పడినట్లుగా చెబుతున్నారు. ఇన్ని నెలల పాటు కరోనా మహమ్మారి పంజా నుంచి తప్పించుకున్న బుజ్జి దేశాలు సైతం ఇప్పుడు ఏదో రకంగా దాని బారిన పడుతుండటం గమనార్హం.