తెలంగాణలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే తెలంగాణలో 499 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే 329 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 129 కేసులను గుర్తించారు. శుక్రవారం 2477 శాంపిళ్లను పరీక్షించగా.. 499 మందికి పాజిటివ్ గా తేలింది. తెలంగాణలో కరోనా టెస్టులు చేయించుకున్నా వారిలో 20.14శాతం మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
తెలంగాణలో మూడు రోజుల్లోనే 1120 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గ్రేటర్ హైదరాబాద్ లో 845, రంగారెడ్డి జిల్లాలో 159 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ , పరిసర జిల్లాల్లో టెస్టులు పెంచడంతోనే కేసులు ఈ స్థాయిలో బయటపడుతున్నాయి.
తెలంగాణలో వెలుగుచూసిన పరీక్షల్లో ఎక్కువశాతం మందికి కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టులు పెంచితే మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందే 33 మందికి కరోనా పాజిటివ్ రావడం తీవ్రతకు అద్దం పడుతోంది. గురువారం నాటికి రాష్ట్రంలో 50569 టెస్టులు చేశారు. ఇందులో 12.9శాతం మందికి పాజిటివ్ అని వచ్చింది. టెస్టుల సంఖ్య పెరిగే కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.