దేశంలో కరోనా తగ్గుముఖం ... కొత్తగా ఎన్ని కేసులంటే ?

Update: 2021-05-29 06:30 GMT
మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. అయితే , గత వారం రోజులుగా దేశంలో నమోదు అయ్యే కరోనా మహమ్మారి కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,73,790 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247కి చేరింది. ఇందులో 22,28,724 యాక్టివ్ కేసులు ఉండగా, 2,51,78,011 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 3617 మంది కరోనాతో మృతి చెందగా  మొత్తం మృతుల సంఖ్య 3,22,512కి చేరుకుంది. నిన్న కొత్తగా 2,84,601 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలా ఉంటే నిన్న ఒక్క రోజులో 20,80,048 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ తెలిపింది. దీనితో ఇప్పటివరకు మొత్తంగా 34,11,19,909 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. అటు ఇప్పటిదాకా 20,89,02,445 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 34,11,19,909 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,80,048 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

కొత్త కేసులు 46 రోజుల తర్వాత అతి తక్కువగా నమోదయ్యాయి. అలాగే వరుసగా 2వ రోజు... కొత్త కేసులు 2 లక్షల కంటే తక్కువ వచ్చాయి. అలాగే వరుసగా మూడో రోజు కొత్త మరణాలు 4వేల కంటే తక్కువ వచ్చాయి. దేశంలోనే అతి ఎక్కువగా తమిళనాడులో కొత్తగా 31.8 వేల కేసులు రాగా... కర్ణాటకలో 22.82వేలు, కేరళలో 22.31వేల కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో 20.74వేల కేసులు వచ్చాయి.
Tags:    

Similar News