కరోనా మహమ్మారి మానవాళిని కబళిస్తోంది. మరణ మృదంగం వాయిస్తోంది. లక్షల కేసులు.. వేల ప్రాణాలు తీస్తోంది. జనాలందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. 10 లక్షల కేసులు దాటాయి. 24 గంటల్లోనే 2494మంది మృతి చెందారు. ఇది కరోనా కోణానికి ఒకవైపు మాత్రమే..
రెండో వైపు చూస్తే కరోనా ప్రకృతిని శుభ్రం చేస్తోంది. సుప్రీం కోర్టు, ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయలేని ఢిల్లీ వాయుకాలుష్యాన్ని దెబ్బకు కంట్రోల్ చేసింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండే అక్కడ గాలిలో కాలుష్యం బాగా తగ్గి దూళి లేక అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పంజాబ్ లో జలంధర్ వాసులకు కొన్ని దశాబ్ధాలుగా కనిపించని హిమాలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మనిషి నాశనం చేసిన ప్రకృతిని ఇప్పుడు కరోనా కంట్రోల్ లోకి తెచ్చింది. లాక్ డౌన్ ఎత్తివేసినా ఇలానే బతకమని హితబోధ చేస్తోంది.
ఇక తాజాగా మానవాళికి కరోనా ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రపంచమంతా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం కావడంతో వాతావరణ కాలుష్యం పూర్తిగా తగ్గి పోయింది. ఈ నేపథ్యంలో ఓజోన్ పొరకు ఉన్న రంధ్రం పూడ్చుకుపోయిందని కోపర్నికస్ అట్మాస్పియర్ మోనిటరింగ్ సర్వీస్, కోపర్నికస్ క్లైమెట్ చేంజ్ సర్వీస్ లు తెలిపాయి.
సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూమిపై ప్రసరించకుండా చేసి మానవుల ప్రాణాలు కాపాడే ఓజోన్ పొర ఇలా కరోనా వల్ల పూడ్చుకుపోవడం మానవాళికి మేలే చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.