కరోనా ఎఫెక్ట్ : విటమిన్ టాబ్లెట్స్ కి పెరిగిన డిమాండ్ !
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికిపోతోంది. వైరస్ వెలుగులోకి ఆరు నెలలు దాటిపోయినా కూడా ఇప్పటికి సరైన వ్యాక్సిన్ అయితే ఇంకా ఎవ్వరూ తయారు చేయలేకపోతున్నారు. అలాగే కరోనా భారిన పడే వారి సంఖ్య రోజురోజుకి భారీగా పెరిగిపోతుంది. దీనితో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ఈ తరుణంలో కరోనా సోకినా కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంటే , దాన్ని ఎదిరించ వచ్చు అని మొదటి నుండి నిపుణులు , వైద్యులు చెప్తూవస్తున్నారు.
కరోనాను ఎదుర్కోవాలి అంటే ఇమ్యూనిటీ పవర్ కావాలి అని చెప్పారు అని , చాలా మంది ఇమ్యూనిటీ పవర్ కోసం విటమిన్ ట్యాబ్లెట్ల ను విపరీతంగా వాడేస్తున్నారు. దీనితో విటమిన్ టాబ్లెట్స్ అమ్మకాలు గత రెండు నెలలుగా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా విటమిన్ డీ–3 , బీ కాంప్లెక్స్, సీ విటమిన్, పారాసెటిమాల్, అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లను ఎక్కువగా కొనేసి ఇంట్లో స్టోర్ చేసుకుంటున్నారు. దీంతో ఏపీలో 25 వేలకు పైగా మందుల షాపులుంటే.. 70 శాతం షాపుల్లో ఈ విటమిన్ ట్యాబ్లెట్ల కొరత ఏర్పడినట్టు తెలుస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని చోట్ల ఎక్కువ ధరకు వీటిని అమ్ముతున్నట్లు సమాచారం. ముఖ్యంగా జింకోవిట్ మాత్రలకూ ఎగబడుతున్నారు.
ఈ పరిస్థితి ఇలా ఉంటే .. విటమిన్ మాత్రల వలన పెద్దగా ప్రయోజనం ఉండదని , సహజ సిద్ధంగా తినే ఆహారం నుంచి వచ్చే విటమిన్లే శరీరానికి మంచివని వైద్యులు చెబుతున్నారు . రోగులు అయితే ఆహారం తినలేరు కాబట్టి .. వారికి మందులను ఇవ్వాల్సి వస్తుందని.. సాధారణంగా ఉండే వారు మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు.