కరోనా ఎఫెక్ట్: రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన కేరళ

Update: 2020-02-04 04:55 GMT
చైనాను వణికిస్తున్న ‘కరోనా’ వైరస్ ఇప్పుడు దేశంలోకి వచ్చేసింది. కేరళ రాష్ట్రం తాజాగా ‘కరోనా’ వైరస్ ఎఫెక్ట్ తో’ రాష్ట్ర విపత్తుగా ప్రకటించడం సంచలనంగా మారింది. తాజాగా కేరళ రాష్ట్రంలో 3వ కేసు నమోదైంది. దీంతో ముగ్గురు కరోనా బాధితులు బయటపడడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది.

రాష్ట్ర విపత్తుతో కేరళ అంతటా హైఅలెర్ట్ ప్రకటించారు. కరోనా వైరస్ దగ్గు, తమ్ముల ద్వారా వ్యాపిస్తుండడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలం కావడంతో దీని తీవ్రత బాగా ఉంటుంది. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం ప్రజలను భయపెట్టడం తమ ఉద్దేశం కాదని.. మంచి అవగాహన కోసం.. వైరస్ ఎక్కువమందికి వ్యాపించకుండా నిర్మూలించే దిశగానే విపత్తుగా ప్రకటించామని తెలిపింది.

చైనా నుంచి తిరిగి వచ్చిన మొత్తం 140మంది కేరళ విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయగా.. అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ ముగ్గురు కరోనా వైరస్ బాధితులని వారిని ప్రత్యేక ఐసోలేషనస్ వార్డుల్లో ఉంచి చికిత్స చేస్తోంది. 46మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ అయ్యింది.

కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లో చైనా నుంచి వచ్చిన 80మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ పరీక్షలు చేస్తూ ధ్రువీకరించుకోవడానికి ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. వీరు బయటకు వస్తే వైరస్ వ్యాపిస్తుందన్న కారణం తో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే గత నాలుగు రోజుల్లో 350మందికి పైగా మరణించారు. భారత్ లోనూ 3 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.
Tags:    

Similar News