కరోనా ఎఫెక్ట్‌ : తెగ తొక్కేస్తున్న జనాలు.. పదేళ్ల రికార్డ్‌ బ్రేక్‌

Update: 2021-05-29 23:30 GMT
ఒకప్పుడు మద్యతరగతి వాడి వాహనం సైకిల్‌. బైక్‌ లు రాని సమయంలో సైకిల్‌ ఉన్న వాడిని గొప్పోడిగా చూసేవారు. సైకిల్‌ ఒకప్పుడు ప్రయాణంకు తప్పనిసరి వాహనం. కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. ఇండియాలో సైకిల్‌ ను పెద్ద వారు ప్రయాణంకు వినియోగించడమే మానేశారు. పిల్లలు సరదాగా సైకిల్ తొక్కుతుంటే పెద్ద వారు మాత్రం వ్యాయామం కోసం సైకిల్ రైడ్‌ చేస్తున్నారు. ఒకప్పటితో పోల్చితే సైకిల్ వినియోగంలో మార్పు వచ్చింది కాని సైకిల్‌ అమ్మకాలు మాత్రం తగ్గలేదు.

సైకిల్ అమ్మకాలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. గడచిన పదేళ్లలో 10 సైకిళ్ల అమ్మకాలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రతి ఏడాది కూడా అయిదు నుండి పది శాతం అమ్మకాలు పెరుగుతూనే వస్తున్నాయి. కాని ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం సైకిళ్ల అమ్మకాలు ఏకంగా 20 శాతం అధికం అయ్యాయి. ఉన్నట్లుండి 20 శాతం గరిష్టంకు సైకిళ్ల అమ్మకాలు పెరగడం మార్కెట్ వర్గాల వారిని సైతం విష్మయానికి గురి చేస్తున్నాయి.

గత ఆర్థిక సంవత్సరం 2020 - 2021 లో సైకిళ్ల విక్రయాలు 1.21 కోట్ల యూనిట్లుగా ఉండగా, 2021 - 22 మాత్రం ఏకంగా 1.45 కోట్లుగా ఉంది. పిల్లల సైకిల్స్‌ తో పాటు పెద్ద వారి సైకిల్స్ అమ్మకాలు కూడా భారీ మొత్తంలో పెరిగాయని మార్కెట్‌ వర్గాల వారు చెబుతున్నారు. ప్రముఖ కంపెనీల సైకిల్లు ఎక్కువగా అమ్మడు పోతున్నాయి. సైకిల్స్‌ వినియోగంకు పలు కారణాలు ఉన్నాయి.

పిల్లల నుండి పెద్దల వరకు సైకిల్స్ వెంట పడటంకు ప్రధాన కారణం కరోనా అనడంలో సందేహం లేదు. మార్కెట్‌ వర్గాల అంచనా మేరకు కరోనా కారణంగా ఇంటికే పరిమితం అవుతున్న పిల్లలతో పాటు పెద్ద వారు కూడా వ్యాయామం మరియు టైమ్‌ పాస్ కోసం సైకిల్ ను వినియోగిస్తున్నారు.

సైకిల్‌ వినియోగించడం వల్ల పెద్ద వారిలో వ్యాయామం అవుతుంది. సమయం ఎక్కువ ఉన్న సమయంలో సైక్లింగ్‌ ఎక్కువ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. లాక్‌ డౌన్‌ సమయంలో ఎక్కువ మంది సైక్లింగ్ పై ఆసక్తిని కనబర్చుతూ ఉన్నారు. ఇంట్లో కూర్చుని కూర్చుని ఉన్న వారికి అధిక బరువు సమస్యగా మారుతుంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న వారు వాకింగ్‌ కంటే సైక్లింగ్‌ కే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే సైకిల్స్ అమ్మకాలు ఎక్కువ అయ్యాయి అనేది ఒక వర్గం వారి వాదన. సైకిల్స్ అమ్మకాలు వచ్చే ఏడాది కూడా ఇదే మాదిరిగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదనే అభిప్రాయంను మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

కరోనా కారణంగా పిల్లలకు ఏడాది అంతా కూడా సమ్మర్‌ హాలీడేస్ గా మారిపోయింది. గడచిన 14 నెలల కాలంలో పిల్లలు పూర్తిగా ఇంటికే పరిమితం అయిన కారణంగా వారికి వ్యాయామం కోసం లేదా సరదా కోసం కూడా సైకిల్స్ ను తల్లిదండ్రులు కొనివ్వాల్సి వస్తుంది. దాంతో ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా సైకిల్స్ అమ్మకాలు పెరిగాయి అంటూ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది పెరిగిన 20 శాతం వచ్చే ఏడాది కొనసాగదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News