100 మంది మావోయిస్టులకు కరోనా?

Update: 2021-05-09 07:30 GMT
క‌రోనా ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు దాటుకొని అడ‌వుల్లోకి కూడా విస్త‌రించిన‌ట్టు స‌మాచారం. దండ‌కార‌ణ్యంలోని మావోయిస్టుల్లో దాదాపు 100 మంది వ‌ర‌కు కొవిడ్ బారిన ప‌డిన‌ట్టు స‌మాచారం. ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రంలోని మావోయిస్టులకు క‌రోనా సోకింద‌ని పోలీసుల‌కు స‌మాచారం అందిన‌ట్టుగా తెలుస్తోంది.

బీజాపూర్, దంతెవాడ‌, సుకుమా జిల్లాల ప‌రిధిలోమావోయిస్టుల ప్రాబ‌ల్యం అధికంగా ఉంది. ఈ జిల్లాల్లో విస్త‌రించి ఉన్న దండ‌కార‌ణ్యాన్ని షెల్టర్ జోన్ గా చేసుకొని మావోయిస్టులు త‌మ కార్య‌క‌లాపాల‌ను సాగిస్తుంటారు. అయితే.. వారికి భోజ‌నాలు, ఇత‌ర‌త్రా అవ‌సరాలు కొరియ‌ర్ల ద్వారానే తీరుతుంటాయి. ఈ నేప‌థ్యంలో వారి నుంచే కొవిడ్ సోకిన‌ట్టుగా పోలీసులు అనుమానిస్తున్నట్టు స‌మాచారం.

అయితే.. వీరిలో కీల‌క మ‌హిళా మావోయిస్టు, అగ్రనేత‌ సుజాత కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈమెతోపాటు దినేష్‌, జ‌య‌లాల్ అనే కీల‌క నేత‌లు కూడా కొవిడ్ బారిన ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. సుజాత‌పై ఏకంగా రూ.25 ల‌క్ష‌ల రివార్డును ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. దినేష్‌, జ‌య‌లాల్ పైనా రూ.10 ల‌క్ష‌ల రివార్డు ఉంది. ఈ నేప‌థ్యంలో వారు ట్రీట్మెంట్ కోసం వ‌చ్చే అవ‌కాశాల‌పై పోలీసులు దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News