పాక్‌ ప్రధానికి కరోనా పాజిటివ్ వ్యాక్సినేషన్‌ తర్వాత పాజిటివ్‌

Update: 2021-03-20 17:30 GMT
కరోనా వైరస్ జోరు మాములుగా లేదు. గత ఏడాదికి పైగా కరోనా వైరస్ కేసులు ప్రతిరోజూ కూడా నమోదు అవుతూనే ఉన్నాయి. మధ్యలో కొన్ని రోజులు కరోనా వేవ్ తగ్గినట్టు అనిపించినా కూడా , ఆ తర్వాత మళ్లీ కరోనా జోరు పెరుగుతుంది. సామాన్యుల నుండి ప్రముఖల వరకు ప్రతి ఒక్కరు కూడా కరోనా మహమ్మారి భారిన పడుతున్నారు.  ఇప్పటికే పలు దేశాలు అధ్యక్షులు, ప్రధానులను సైతం కోవిడ్ పలకరించగా, తాజగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ కోవిడ్ బారినపడ్డారు ఆయన వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పాజిటివ్‌ గా తేలింది.

కోవిడ్ లక్షణాలు కనిపించడంతో, ఆయనకు నేడు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ‌గా తేలింది. దీనితో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హోం ఐసోలేషన్‌ లో ఉన్నారని పాక్ ఆరోగ్యశాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించగా పాజిటివ్ ‌గా తేలినట్టు పాక్ ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు.  పాక్‌ లో ఇప్పటివరకు 6,15,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మార్చి 10న ప్రజలకు వ్యాక్సిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు. ఫిబ్రవరి మొదట్లో ఆరోగ్య కార్యకర్తలు, కరోనా వారియర్స్‌కు టీకా వేయగా ఇప్పుడు.. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రధానికే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మార్చి 18న ఇమ్రాన్ ఖాన్ చైనా వ్యాక్సిన్ సినోఫార్మ్ యొక్క మొదటి డోసు తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. చైనా సినోఫార్మ్ ‌ను పాకిస్థాన్ ‌కు విరాళంగా ఇచ్చింది, ఒక రోజు తరువాత టీకా డ్రైవ్ ప్రారంభించటానికి దేశానికి వీలు కల్పించింది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా పాజిటివ్ గా తేలడంతో దీనిపై ప్రస్తుతం విపరీతంగా చర్చ జరుగుతుంది. 
Tags:    

Similar News