కరోనా-కోవిడ్-19... పేరు ఏదైనా.. ప్రపంచాన్ని కుదిపేసిన అంటు వ్యాధి. ప్రతి ఒక్కరినీ హడలెత్తించిన మహ మ్మారి. పేదలు-ధనిక వర్గాలు అనే తేడా లేకుండా.. సర్వసహా.. సమానమనే భావనతో అందరికీ అంటుకు న్నా.. అన్ని దేశాలను చుట్టేసిన.. ఈ వ్యాధి.. అసలు ఎక్కడ పుట్టింది? ఎలా వచ్చింది? మనుషుల నుంచి మనుషులకు అంటుకుంటుందని మాత్రమే తెలుసు.. కానీ, ఆ మనుషులకైనా ఎలా అంటుకుంది? ఆహారం ద్వారానా? నీటి ద్వారా? గాలి ద్వారా? అసలు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు గడిచిన ఏడాదిన్నర కాలంలో ప్రపంచ మేధావులు దృష్టి పెట్టారు. కరోనా పుట్టుకను తేల్చేస్తామని ప్రతిజ్ఞలు చేశారు.
ఇక, రాజకీయ పరంగానూ కరోనా కల్లోలం అంతా ఇంతా కాదు. తొలుత ఇది చైనాలోని ఊహాన్‌లో వెలుగు చూసినా.. తర్వాత .. ప్రపంచానికి పాకింది. కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలను హరించింది. అగ్రరాజ్య మా.. అథమ రాజ్యమా.. అభివృద్ధి చెందిన దేశమా.. ఆకలితో అలమటిస్తున్న దేశమా .. అనే తేడా లేకుం డా.. అన్ని దేశాలకూ విస్తరించింది. ఆర్థిక వ్యవస్థలను బదాబదలు చేసింది. అన్నీ సాధించాం.. అన్న మానవుడి ప్రజ్ఞకు పెను సవాల్ విసిరింది. ఈ క్రమంలో దీని అంతు చూడాలని.. గుట్టు పట్టుకోవాలని ప్రయత్నాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.
చైనా లో పుట్టింది కనుక.. దీనిని చైనా వ్యూహాత్మకంగా ల్యాబ్ ద్వారా తయారు చేసిందని.. ఇది ఒక జీవా యుధమని.. అప్పటి అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు కక్కారు. కానీ, దీనిలో పసలేదని.. క్షేత్రస్థా యిలో పర్యటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది. ఇక, అమెరికాలోనూ దీనిపై ప్రయోగాలు సాగాయి. చివరాఖరుకు తేల్చింది ఏంటంటే.. ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పలేమనే! ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. అగ్రరాజ్యమే కరోనా పుట్టుకపై చేతులు ఎత్తేసింది.
వాస్తవానికి ప్రపంచాన్ని కాకవికలం చేసిన కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎంతో ప్రయత్నిస్తున్నారు.. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే ఈ వైరస్ లీక్ అయి ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఈ వాదనను చైనా ఖండించింది. ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ-ఐసీ.. కొవిడ్-19 మూలాలను కనుక్కోవడం ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో వైరస్ పుట్టుక తెలుసుకోలేమని నివేదికలో పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడిగా జో బెడైన్ అధికారం చేపట్టాక.. ఈ ఏడాది మేలో 17 ప్రధాన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఐసీని ఏర్పాటు చేశారు. కరోనా పుట్టుకపై 90 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వారే ఇప్పుడు నివేదికను బైడెన్ ముందుంచారు. మరింత సమాచారం లభిస్తే తప్ప వైరస్ మూలాన్ని కనుగొనలేమని వారు స్పష్టం చేశారు. అంటే.. దాదాపుగా కరోనా విశ్వరహస్యంగా మారిపోయింది. ఈ విశ్వ పుట్టుక గురించి ఇప్పటి వరకు ఎలా అంతు చిక్కలేదో.. ఇప్పుడు కరోనా కూడా ఆ జాబితాలోకే వెళ్లిపోయినట్టు అయిందని అంటున్నారు నిపుణులు. సో.. ఇదీ..కరోనా కథ!