కరోనాకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొన్నటి దాకా కేసుల నమోదు తగ్గిన దేశాల్లో.. ఇప్పుడు మళ్లీ భారీగా నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ చాలా దేశాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ లెక్కన చూస్తే.. మన దేశంలో తీవ్రత కాస్త తక్కువగా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత తక్కువగా ఉందని చెప్పాలి.
గతంతో పోలిస్తే.. కరోనా కేసుల నమోదు రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ఇంతకాలం ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. ఇలాంటివేళ.. కొత్త కేసులు నమోదుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల అలవాటు.. అనుసరిస్తున్న తీరుకు మామూలుగా అయితే.. భారీగా కేసులు నమోదు కావాల్సి ఉంది. లక్కీగా అలాంటి పరిస్థితి లేకపోవటం ఊరట కలిగించే అంశంగా చెప్పాలి.
తెలంగాణ విషయానికి వస్తే.. గడిచిన కొద్దిరోజుల మాదిరే రోజుకు రెండు వేల కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. శనివారం విషయానికే వస్తే 1811 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే.. కొత్త కేసుల నమోదుతో పోలిస్తే.. డిశ్చార్జి అవుతున్న కేసులు ఎక్కువగా ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పాజిటివ్ గా నమోదైన వారిలోనూ అత్యధికులకు కరోనా లక్షణాలు తక్కువగా ఉండటం గమనార్హం.
తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న కేసులు 26104 అయితే.. అందులో 21551 మందికి కరోనా లక్షణాలు పెద్దగా లేవు. మిగిలిన ఐదు వేలలో కూడా సీరియస్ గా ఉన్న కేసులు తగ్గినట్లుగా తెలుస్తోంది. అత్యధికులు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. దేశంలోని రికవరీ రేటుతో పోలిస్తే తెలంగాణ ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశంలో రికవరీ రేటు 85.81 శాతం ఉంటే తెలంగాణలో మాత్రం 87.01 శాతంగా ఉంది.
ఏపీ విషయానికి వస్తే.. ఆ మధ్య వరకు రోజుకు 10వేల కేసులు నమోదు కావటం తెలిసిందే. ఇప్పుడు ఆ జోరు తగ్గింది. రాష్ట్రంలో సెకండ్ వేవ్ షురూ అయినట్లుగా అధికారులు చెబుతున్నా.. కేసుల నమోదు మాత్రం తక్కువగా ఉంది. ప్రస్తుతం రోజువారీగా ఆరు వేల కంటే తక్కువగా కేసులు నమోదువుతున్నాయి. రికవరీల సంఖ్య అంతకంతకూ పెరగుతుతోంది. ప్రస్తుతం 46.6 వేల మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరిలో అత్యధికులు పెద్దగా లక్షణాలు లేని వారే. కొత్త కేసులతో పోలిస్తే.. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.