కరోనా 2021ను మరింత కబళిస్తుంది

Update: 2020-11-16 00:30 GMT
గత 100 సంవత్సరాల్లోనే అత్యంత భయంకర బీతావాహ సంవత్సరం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా 2020నే. అందరినీ ఇంట్లో కూర్చుండబెట్టి సెలవునిచ్చిన ఈ సంవత్సరాన్ని ఎవరూ మరిచిపోరు. కరోనా సోకి ప్రపంచమే బందీ అయిపోయింది.

కరోనా వ్యాప్తితో లాక్డౌన్ కారణంగా వ్యాపార రంగం, ఉద్యోగ, ఉపాధి నిలిచిపోయి ప్రపంచదేశాలన్నీ ఆర్థికమాంద్యంలోకి కూరుకుపోయాయి. దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ఎత్తేసినా ఇంకా ఆర్థిక పరిస్థితులు కుదుట పడలేదు. ఇప్పటికీ ఉద్యోగ, ఉపాధి రికవరీ కాలేదు.

ఇన్ని ఉపద్రవాల నడుమ ఐక్యరాజ్యసమితి మరో బాంబు పేల్చింది. 2020 కంటే వచ్చే ఏడాది 2021 మరింత ప్రమాదకరంగా ఉండబోతోందని ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ ఆహారకార్యక్రమం ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లీ హెచ్చరించాడు. కోవిడ్ 19 విపత్తు 2021 ఏడాదిని మరింత కబళిస్తుందని ఆయన పేర్కొన్నాడు.

ప్రపంచవ్యాప్తంగా ఈ శీతాకాలం ప్రారంభం కావడంతో రెండో వేవ్ మొదలైందని.. ఇప్పటికంటే తీవ్రత మరింతగా ఉండబోతోందని ఆయన హెచ్చరించాడు. కరోనాపై ఇంకా నియంత్రణ సాధించలేదని.. బ్రిటన్ లాంటి దేశాలు మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయన్నారు.కరోనాను జయించిన న్యూజిలాండ్ లోనూ మరోసారి కరోనా కేసులు వెలుగుచూశాయని తెలిపారు. వచ్చే ఏడాది కూడా ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్ర ప్రభావం చూపుతుందని డేవిడ్ బేస్లి తెలిపారు.




Tags:    

Similar News