కరోనా: ఆక్సిజన్ కొరతే మరణాలకు కారణం?

Update: 2021-04-17 14:30 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. అల్లకల్లోలం సృష్టిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతోంది. ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. కరోనా ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుండడం.. ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు.కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో సరిపడా ఆక్సిజన్ నిల్వలు లేవు. ఆక్సిజన్ అందక కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పెరగడానికి ఆక్సిజన్ కారణంగా చెబుతున్నారు. ప్రధాన నగరాలతోపాటు మారుమూల ప్రాంతాల్లోనూ ఆక్సిజన్ కావాల్సిన రోగుల సంఖ్య పెరగడంతో డిమాండ్ ఎక్కువై ఎవరికి సరిపోవడం లేదు.దీంతో అన్ని రాష్ట్రాలకు అదనంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 50వేల మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది.

100 మంది రోజుల్లో 20మందికి సీరియస్ గా ఉంటోందని.. ముగ్గురికి ఆక్సిజన్ అవసరం అవుతోందని తేలింది. మహారాష్ట్రలోనే ఆక్సిజన్ కావాల్సిన రోగుల సంఖ్య అధికంగా ఉంది. ఆ రాష్ట్రానికి 1250 టన్నుల ఆక్సిజన్ కేటాయింపులు ఉండగా.. అది ఇప్పటికే పూర్తయ్యింది. మహారాష్ట్రలో ఏకంగా 6.38 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. బాధితుల్లో 60వేలమందికి ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఏర్పడింది.

మధ్యప్రదేశ్ లోనూ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఆయా రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కు సిలిండర్లు తగ్గించడంతో అక్కడ కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా ఎక్కువగా ఉన్న దేశంలోని రాష్ట్రాలకు అదనంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రం భావిస్తోంది.
Tags:    

Similar News