ప్రపంచాన్ని మహమ్మారులు భయపెడుతున్నాయి.రోజురోజుకు కొత్త రోగాలు వ్యాప్తి చెందుతూ కలవరపడుతున్నాయి. ఇరాక్ లో 1979లో మొదటిసారిగా 'కాంగో వైరస్' కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 43 ఏళ్లకు తాజాగా మరోసారి కేసులు బయటపడ్డాయి. ఇరాక్ లో ప్రస్తుతం ఈ వైరస్ విజృంభిస్తోంది. పక్క దేశాలకు పాకే ప్రమాదం ఉంది. ఇరాక్ దేశంలో మాంసం తినాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
ప్రపంచాన్ని కొత్త వ్యాధి కలవరపెడుతోంది. ఇరాక్ దేశంలో పెరుగుతున్న కాంగో ఫీవర్ ప్రపంచవ్యాప్తగా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా ఉధృతి కాస్త తగ్గింది అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే 'మంకీ పాక్స్ ' వచ్చి కంగారుపెట్టింది. ఇప్పుడు ఆ ఉపద్రవం ముగియకముందే కాంగో ఫీవర్ కొత్తగా కలవరపెడుతోంది. ఇరాక్ దేశంలో కాంగో ఫీవర్ తో ప్రజలు మృత్యువాత పడుతున్న పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయానికి గురిచేస్తున్నాయి.
మన జుట్టులో ఉండే పేలలో ఉండే నైరో వైరస్ కారనంగా ఈ ‘కాంగో ఫీవర్’ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ పశువుల దగ్గరున్నా.. ఈ వైరస్ ఉన్న పేలు కుట్టినా ఇది సోకుతుంది. తలనొప్పి, జ్వరం, వాంతులు, విరోచనాలు, శ్వాస సమస్య ఈ వ్యాధికి ఉన్న ప్రధాన లక్షణాలు. దీనిని ప్రాణాంతక వైరస్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ 'డబ్ల్యూ.హెచ్.వో' పేర్కొంది.
ప్రస్తుతం ఇరాక్ దేశంలో ఈ వ్యాధి సోకిన పశువులను, వాటి పేలను సేకరించి పరిశోధన చేస్తున్నారు. అలాగే ఇది వ్యాప్తి చెందకుండా పురుగు మందులను పిచికారి చేస్తున్నారు. ఇది చాలా త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న కారణంగా రక్షణ కిట్లను ధరించి మరీ కాంగో ఫీవర్ నియంత్రణకు ఇరాక్ దేశంలో ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఇరాక్ దేశంలో 111 కాంగో ఫీవర్ కేసులలో 19 మంది మరణించడం కలకలం రేపుతోంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. త్వరగా తయారు చేయాలని డబ్ల్యూ.హెచ్.వో వెల్లడించింది. ఇక ఈ వైరస్ వల్ల ముక్కు నుంచి తీవ్రమైన రక్తస్రావం అవుతుందని.. ప్రజలు మరణించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇక కాంగో వైరస్ కంటే ముందే ప్రస్తుతం ప్రపంచ దేశాలను 'మంకీపాక్స్' వైరస్ కలవరపెడుతోంది. బ్రిటన్ లో వెలుగుచూసిన ఈ వైరస్ నెమ్మదిగా ఇతరదేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే 120కి పైగా కేసులు నమోదయ్యాయి. మరిన్ని కేసులు పరిశీలనలో ఉన్నాయి. దాంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మే 7న బ్రిటన్ లో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ ను కనుగొన్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ బయటపడింది. అప్పటి నుంచి బ్రిటన్ లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 20కి ఆ సంఖ్య చేరుకుంది. స్పెయిన్ లోనూ ఇప్పటివరకూ 23 కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ కేసుల జాబితాలో చేరిపోయాయి.ఇప్పుడు ఈ కొత్త వైరస్ మరింతగా ప్రజలను భయపెడుతోంది.