దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణమృదంగం వాయిస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలోలేని విధంగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు , కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు కూడా దేశంలో మూడు వేలమందికి పైగా మరణించారు. వరుసగా పదో రోజు 3 వేల మందిపైగా మృతి చెందారు. దీనితో ఈ పది రోజుల సమయంలోనే మొత్తం 36,110 మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని బట్టి చూస్తే .. గంటకు 150 మంది చొప్పున మృతి చెందారు. అమెరికా కంటే భారత్ లో రోజువారీ మరణాలు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో గురువారం 780 మంది చనిపోతే , భారత్ లో ఆ సంఖ్య దాదాపు 4 వేలు. మరోవైపు వరుసగా రెండో రోజు దేశంలో 4 లక్షలపైగా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 4,01,078 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,18,609 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 4,187 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,38,270కు పెరిగింది.
ఇకపోతే , దేశంలోని 24 రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు 15పైగా ఉందని, అలాగే 9 రాష్ట్రాల్లో 5 నుంచి 15 మధ్య ఉందని కేంద్రం తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ లో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, బిహార్, హరియాణ, ఒడిషా, ఉత్తరాఖండ్ లో పాజిటివ్ లు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా శుక్రవారం వెల్లడించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు మించి యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు 50 వేలు-లక్ష మధ్య ఉన్నట్లు పేర్కొన్నారు. రాబోయే మూడు రోజుల్లో 8 రాష్ట్రాలకు 10.25 లక్షల టీకాలు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో 3.84 లక్షల డోసులున్నట్లు వెల్లడించింది. ఏపీకి ఇప్పటివరకు 72,96,280 టీకాలు ఇవ్వగా, 70,70,226 డోసులను వినియోగించారని స్పష్టం చేసింది.
ఇక కరోనా సెకండ్ వేవ్ లో కేసులు పెరుగుతుండటంతో కేసుల్ని అదుపులోకి తీసుకురావడానికి చాలా రాష్ట్రాలు ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ , నైట్ కర్ఫ్యూ వంటివి అమలు చేశాయి. కానీ, వాటితో కరోనా అన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టకపోవడం తో కొన్ని రాష్ట్రాలు మళ్లీ పూర్తిగా లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. కర్ణాటక ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. సీఎం యడియూరప్ప శుక్రవారం వైద్య నిపుణులు, కేబినెట్ మంత్రులతో సుదీర్ఘంగా చర్చించి లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించింది. రాజస్థాన్ ప్రభుత్వం సోమవారం నుంచి 24వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించింది. కేరళలో శనివారం నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. నిత్యావసరాలు, పాలు కొనుగోళ్లకు ఉదయం 6 నుంచి 10 వరకు వెసులుబాటు ఇవ్వనున్నారు.