ప్రపంచం వ్యాప్తంగా కరోనా మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రతి రోజు కూడా చాలా దేశాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఎంపిక చేసిన వర్గాల ప్రజలకు ప్రభుత్వాలు వ్యాక్సిన్ అందజేస్తున్నాయి. అక్కడక్కడ తప్ప ఈ వాక్సిన్ దుష్పరిణామాల గురించి పెద్దగా వార్తలేం రావడం లేదు. అయితే కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌లపై కొన్ని వ్యాక్సిన్‌లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది.
యూకే - బ్రెజిల్ - దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా స్ట్రెయిన్ లను న్యూట్రలైజ్ లో ఫైజర్- మోడెర్నా టీకాలు విఫలమవుతున్నాయట. సాధారణంగా వైరస్‌కు యాంటీ బాడీస్ అతుక్కుని దానిని న్యూట్రలైజ్ చేస్తాయి. అందువల్ల ఆ వైరస్ కణాలలోకి ప్రవేశించలేదు. ఎలాంటి ఇన్ఫెక్షన్‌నూ కలిగించలేదు. అయితే వైరస్ లో పరివర్తనం జరుగుతున్నప్పుడు ఈ యాంటీ బాడీస్ సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నాయట. మాతృ వైరస్ తో పోల్చుకుంటే కొత్త స్ట్రెయిన్‌లు 40 శాతం వరకు నిరోధకతను కలిగి ఉంటున్నాయట. ప్రఖ్యాత జర్నల్ సెల్ లో ఈ అధ్యయనం వెల్లడించింది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. కొత్త కేసుల సంఖ్య మళ్లీ 26 వేలు దాటింది. గత 24 గంటల్లో 26,291 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 17,455 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,85,339కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 118 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,725 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,10,07,352 మంది కోలుకున్నారు.