ఏపీ కరోనా కేసుల్లో మరో మలుపు ... 11 ఏళ్లలోపు పిల్లల్లో కొత్త ఇన్‌ ఫెక్షన్లు !

Update: 2020-04-17 05:51 GMT
ఆంధ్రప్రదేశ్ లో  కరోనా వైరస్ కేసుల్లో మరో కొత్త మలుపు. కరోనా వైరస్ పాజిటివ్‌ గా నిర్ధారించిన వారిలో 11 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారని, వైరస్ వ్యాప్తి చెందడంలో ఇది న్యూ ట్రెండ్‌ గా మారిందని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి  తెలిపారు. అలాంటి కేసుల్లో సరికొత్త వ్యాధులు, ఇన్‌ ఫెక్షన్లు కనిపిస్తున్నాయని, ఈ కొత్త ఇన్‌ ఫెక్షన్ గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈ కొత్త వ్యాధి , కొత్త  ఇన్‌ ఫెక్షన్లల పై  ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్  సూచనలను పాటిస్తున్నామని అన్నారు.

ఈ ఇన్‌ ఫెక్షన్ ప్రభావం ఎంత వరకు ఉంటుంది. దాని లక్షణాలు ఏమిటనే విషయంపై తాము ఐసీఎంఆర్ అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నామని,  ఇప్పటిదాకా ఆ పిల్లలకు ఐసీఎంఆర్ జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే వైద్య చికిత్సను అందిస్తున్నామని,  కరోనాా వైరస్ పాజిటివ్‌ గా తేలిన పేషెంట్లకు అందించే వైద్య విధానాన్నే ఆ పిల్లల విషయంలో అనుసరిస్తున్నామని తెలిపారు. ట్రీట్‌ మెంట్, ప్రొటోకాల్‌ లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు. దీనిపై  ఐసీఎంఆర్  
ఏవైనా సూచనలు చేస్తే వాటిని ఫాలో అవుతాం అని చెప్పారు.

ఇకపోతే రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన 11 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య పరిమితంగానే ఉంది.  వీరిలో కొంతమంది ఇప్పటికే కరోనా పై విజయం సాధించి , హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్లిపోయారు . దీనితో 11 సంవత్సరాల లోపు పిల్లల్లో కనిపిస్తోన్న ఈ కొత్త వ్యాధి, ఇన్‌ఫెక్షన్ గురించి పూర్తి వివరాలను ప్రభుత్వం సేకరించే పనిలో పడింది. ఈ లక్షణాలు కనిపించిన పిల్లల వివరాలు, కుటుంబ నేపథ్యం, ట్రావెలింగ్ హిస్టరీ వంటి సమాచారాన్ని ఐసీఎంఆర్‌ కు పంపించింది. ప్రస్తుతానికి కరోనా వైరస్ పేషెంట్లకు అందజేస్తోన్న వైద్య చికిత్స విధానాన్నే వీరికి  వర్తింప జేస్తున్నారు. దీని అనంతరం ఐసీఎంఆర్ నుంచి సూచనలు, సలహలను అనుసరిస్తారు. దీని అనంతరం ఐసీఎంఆర్ నుంచి సూచనలు, సలహలను అనుసరిస్తారు.
Tags:    

Similar News