రెండంటే రెండు జిల్లాలు ఇప్పుడు ఏపీకి తలనొప్పిగా మారటమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఆ రెండింటి కారణంగా కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేలా చేసిన ప్రయత్నాలన్ని బూడిదలో పోసిన పన్నీరులా మారింది. కొందరి నిర్లక్ష్యం అందరూ మూల్యం చెల్లించాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. మొత్తంగా ఏపీలో నమోదైన కరోనా కేసుల్లో సింహభాగం ఆ రెండు జిల్లాలదే కావటం గమనార్హం. ఏపీలో అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న కరోనాకు కారణం రాష్ట్రంలోని కర్నూలు.. గుంటూరు జిల్లాలే.
బుధవారం నాటికి రాష్ట్రం మొత్తం 821 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో సగం వరకూ రెండు జిల్లాలే కావటం గమనార్హం. కర్నూలు జిల్లాలో 200 కేసుల్ని దాటితే.. గుంటూరు జిల్లాలో 177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో క్రిష్ణా జిల్లా నిలిచింది. ఆ జిల్లాలో 86 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనూ కొత్త కేసులు 60 వరకు నమోదయ్యాయి. వాటిల్లో సగానికి పైగా కేసులు కర్నూలు.. గుంటూరు జిల్లాల్లోనివే కావటం చూస్తే.. ఏపీలో నమోదయ్యే కరోనా కేసులకు కేరాఫ్ గా ఆ రెండు జిల్లాలు మారాయి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏపీలోని కర్నూలు.. గుంటూరు జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతుంటే.. ఉత్తరాంధ్రలోని విజయనగరం.. శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కేసు నమోదు కాకపోవటం విశేషంగా మారింది. చివరకు విశాఖ మహానగరం పరిధిలోని విశాఖ జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు ఏపీ జాబితాలో అట్టడుగున ఉండటం గమనార్హం. సాధారణంగా కరోనా పాజిటివ్ కేసులకు టైర్ వన్ నగరాల్లోనే ఎక్కువ. తర్వాత స్థానం టైర్ టూ నగరాలే. ఈ లెక్కన చూసినప్పుడు ఏపీలో ఉన్న అతి పెద్ద పట్టణాల్లో ఒకటిగా ఉన్న విశాఖపట్టణంలో కేసుల నమోదు ఎక్కువగా ఉండాలి. మిగిలిన పట్టణాలతో పోలిస్తే.. విశాఖలో తక్కువ కేసులు నమోదయ్యాయి.
బుధవారం వెలుగు చూసిన అరవై కేసుల్లోనూ సగానికి పైగా కేసులు మూడు జిల్లాలకే పరిమితం. కర్నూలు జిల్లాలో 19.. గుంటూరు జిల్లాలో 15.. అనంతపురం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. ఏపీలో నమోదైన కేసుల్లో ఎనిమిది శాతం వరకూ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరులో అత్యధికంగా ఎనిమిది మంది మరణిస్తే.. క్రిష్ణా జిల్లాలో ఆరుగురు మరణించారు. తర్వాతి స్థానంలో కర్నూలు (5).. అనంతపురం (4) నిలిచాయి. కేసుల నమోదులో తొలి స్థానంలో ఉన్న కర్నూలు జిల్లా.. మరణాల్లో మాత్రం మూడో స్థానంలో నిలిచింది.
ఏపీని మూడు భాగాలుగా విభజించి చూసినప్పుడు రాయలసీమలో అత్యధిక కేసులు నమోదు కాగా.. కోస్తా ప్రాంతం తర్వాతి స్థానంలో నిలుస్తుంది. ఆశ్చర్యకరంగా ఉత్తరాంధ్ర లో అతి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 120 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.