వైరస్ రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీన్ని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కొనసాగుతోన్న మూడోదశ లాక్ డౌన్ మే 17 వరకు కొనసాగబోతుంది. ఆ తరువాత కూడా నాలుగో దశ లాక్ డౌన్ ఉంటుంది అని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేసారు. మూడోదశ లాక్ డౌన్ ను విధించిన నేపథ్యంలో లాక్ డౌన్ కి కొన్ని సడలింపులు ఇచ్చారు. జిల్లాల వారీగా జోన్లుగా విభజించి ..లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. రెడ్ జోన్లలో పూర్తిగా లాక్ డౌన్ ను అమలు చేస్తుండగా ... ఆరెంజ్ , గ్రీన్ జోన్లలో సడలింపులతో కూడిన లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఐతే , అక్కడ కూడా మాస్కులు , భౌతికదురం తప్పనిసరి చేసారు. అలాగే మాస్క్ లేకుండా బయటకి వస్తే రూ . 1000 ఫైన్ అని తెలిపారు.
ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ తప్పనిసరి చేసినప్పటికీ కూడా నగరవాసులు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మాస్కు ధరించకపోతే పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. మాస్కు ఉల్లంఘనలను సీసీ కెమెరాల్లో అమర్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పోలీసు శాఖ గత వారం రోజులుగా గుర్తిస్తోంది . బుధవారం వరకు కేసుల సంఖ్య 4,719 దాటాయి. ఇలా నమోదవుతున్న కేసుల్లో జిల్లాల్లో తక్కువగా, నగరాల్లోని కమిషనరేట్లలో అధికంగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ ఉల్లంఘనలు మరీ అధికంగా ఉన్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీలో ఈ నిబంధనను ప్రజలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. కేవలం ఐదు రోజుల్లోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,315 కేసులు నమోదయ్యాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ..నగర వాసులు ఎంతగా రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారో. ఆ తర్వాతి స్థానంలో వరంగల్ (603), రామగుండం (472), రాచకొండ (390), ఖమ్మం (197) నిలిచాయి. కాగా, కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు అందరూ విధిగా మాస్కు ధరించాల్సిందేనని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.