క‌రోనాకు మందు: ఢిల్లీ యూనివ‌ర్సిటీలో విస్తృత ప‌రిశోధ‌న‌లు

Update: 2020-04-13 10:50 GMT
క‌రోనా మ‌హ‌మ్మారికి మందు క‌నిపెట్ట‌డానికి ఎన్నో సంస్థ‌లు కృషి చేస్తున్నాయి. ప్ర‌పంచ దేశాల‌తో పాటు భార‌త‌దేశంలోనూ క‌రోనా వైర‌స్‌కు విరుగుడు క‌నిపెట్టేందుకు విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు సాగుతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌ లో ఓ సంస్థ క‌రోనా వైర‌స్‌ కు వ్యాక్సిన్ క‌నిపెట్టేందుకు చేస్తున్న ప‌రిశోధ‌న‌లు తుది ద‌శ‌కు చేరాయి. త్వ‌ర‌లోనే మందు క‌నిపెట్టే అవ‌కాశం ఉంది. దీంతో దేశంలోని మిగ‌తా ప్రాంతాల్లో కూడా మందు క‌నిపెట్టేందుకు ప్ర‌యోగాలు, ప‌రిశోధ‌న‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో కరోనా వైరస్‌ ను ఎదుర్కొనేందుకు కొన్ని సంస్థలు బయోటెక్నాలజీ విభాగం సహకారంతో యాంటీ బాడీస్‌ ను తయారు చేసేందుకు పనిలో చేస్తున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఢిల్లీ విశ్వ‌విద్యాల‌య సౌత్‌ క్యాంపస్‌ సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ ఇన్‌ఫెక్షన్‌ డిసీస్‌ రీసెర్చ్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌లో విజయ్‌ చౌదరీ ఆధ్వర్యం లో దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో బయోటెక్నాలజీ విభాగంతో కలిసి చౌదరీ ముందుకు వెళ్తున్నారు. చౌదరీ నేతృత్వంలోని బృందం.. జెన్యువులను ఎన్‌కోడింగ్‌ చేసే ప్రతిరోధకాలను వేరుచేస్తుంది.

ఈ యాంటీ బాడీస్ సార్స్‌-కోవ్‌-2ను తటస్థం చేయగలదు. క‌రోనా వైర‌స్ నుంచి నుంచి కోలుకున్న వారి కణాలను సేకరించే ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్నారు. ల్యాబరేటరీల్లో యాంటీబాడీస్‌ను తయారు చేయడంలో యాంటీబాడీ జన్యువులు దోహ‌దం చేస్తాయి. ఇది కరోనా వైరస్‌ ను తటస్థం చేయడం లో విజయవంతమైతే క‌రోనా రోగులకు చికిత్స కోసం యాంటీబాడీస్‌ ఎంతో స‌హ‌క‌రిస్తాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ లో పని చేస్తున్న అమూల్య పాండా, పుణేలోని జెన్నోవా బయో ఫార్మా స్యూటికల్‌ లిమిటెడ్‌లో పని చేసే సంజయ్‌ సింగ్ త‌దిత‌రులు ఈ ప‌రిశోధ‌న‌లో సహాయకులుగా ఉన్నారు. వీరి ప‌రిశోధ‌న‌లు విజ‌య‌వంత‌మై క‌రోనా నివార‌ణ‌కు ఆవిష్క‌ర‌ణ చేస్తే దేశంలో ఇక క‌రోనాకు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదు.
Tags:    

Similar News