మంగళవారం ఒక్కరోజే ఇక్కడ ఇన్ని కేసులు.. మరణాలు

Update: 2020-04-29 04:00 GMT
భారతదేశంలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నగరంగా దేశ వాణిజ్య రాజధాని  ముంబై నిలిచింది. ఇక్కడ దేశంలోనే అన్ని నగరాలతో పోల్చితే అత్యధికంగా 2073 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనూ దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో ఆసియాలోనే  అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ‘ధారవి’లో 100+కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని బాంబు పేల్చింది.  ఇప్పటికే 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావి.  ఇక్కడ కొద్దిరోజులుగా కరోనా వేగంగా ప్రబలింది.అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విరుచుకుపడుతోంది.  

మంగళవారం ఒక్కరోజే ధారావిలో 42 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజగా నిన్న ధారావిలో నాలుగు కరోనా మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో అక్కడి మురికివాడ జనాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు ఒక్క ధారావిలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 330కి చేరాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో కొత్తగా చనిపోయిన వారితో కలిపి 18మంది కరోనాతో మరణించడం విషాదం నింపింది.

ముంబైలోనే ఈ ప్రాంతం అత్యధిక కేసులు నమోదయ్యే రెడ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. చర్యలు చేపట్టింది. ధారావిలోని మహిమ్ ప్రాంతంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు అసలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అలాంటిది మంగళవారం ఒక్కరోజే ఈ ప్రాంతంలో ఐదు కరోనా కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది.
Tags:    

Similar News