కరోనా వైరస్ ..ఈ మహమ్మారి దెబ్బకి దేశంలోని ప్రతి రాష్ట్రం కూడా అల్లాడిపోతోంది. దేశంలో ఇప్పటికే కరోనా భాదితుల సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. అయితే , దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నప్పటికీ కూడా కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు కదా పెరుగుతున్నాయి.
ఇకపోతే, ఈ మద్యే మరోసారి మే 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. అయితే , దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని దేశాన్ని కరోనా కేసులని పరిగణలోకి తీసుకోని , రెడ్ , ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించారు. అలాగే జోన్ల వారికీ కొన్ని ఆంక్షలతో కూడా సడలింపులు ఇచ్చారు. అయితే, సడలింపులు ఇచ్చిన ప్రాంతాలలో మళ్లీ యధావిధిగా ప్రజలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఎవరు కూడా సామజిక దూరం పాటించడంలేదు.
కాగా, కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే తెలంగాణలో కరోనా మహమ్మారి కొంచెం కంట్రోల్ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జీహెచ్ ఎంసీ - రంగారెడ్డి - మేడ్చల్ పరిధిలోని ఇళ్లలోకి పని మనుషులకు అనుమతి లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మూడు జిల్లాలు కూడా రెడ్ జోన్ లో ఉన్నాయి. ఈ పరిధిలోని గేటెడ్ కమ్మ్యూనిటీలకు, అన్ని అపార్ట్ మెంట్ లకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. తప్పనిసరి అయితే మాత్రం మునిసిపల్ ఆఫీసు నుండి నో ఆబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలని స్పష్టంచేసింది.