ప్రస్తుతం దేశాన్ని నాశనం చేస్తున్న వైరస్ ను అరికట్టడానికి లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల కేవలం నిత్యవసరాల దుకాణాలు తప్ప , మిగిలిన అన్ని దుకాణాలను మూసేసారు. అయితే , ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నుండి కొన్ని మినహాయింపులు ఇస్తూ కొన్ని షాప్స్ కి పర్మిషన్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రమంగా కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ వస్తోంది. ఇప్పటికే మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో మందుబాబులు ఊరట చెందారు. తాజాగా రాష్ట్రంలో కల్లు అమ్మకాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజాగా తెలంగాణ సర్కార్ కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా జిల్లాల్లో కల్లు విక్రయాలకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చెట్ల వద్దే కల్లు తీసి విక్రయించేందుకే అనుమతి ఇస్తున్నామని, కల్లు దుకాణాలకు మాత్రం అనుమతి నిరాకరిస్తున్నామని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కల్లు దుకాణాలకు కూడా అనుమతి ఇవ్వాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, సలహాదారు చింతల మల్లేశం గౌడ్ తదితరులు గత శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ క్రమంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. మే 13 నుంచి ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని కల్లు దుకాణాల్లో విక్రయాలు జరుపవచ్చనని మంత్రి చెప్పారు. కాగా, లాక్ డౌన్ నిబంధనలకు లోబడి భౌతిక దూరాన్ని పాటిస్తూ కల్లు విక్రయాలు జరగాలన్న ఆయన.. పోలీసులు కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. గీత వృత్తిదారులను ప్రోత్సహించడానికి ఇప్పటి వరకూ 3.54 కోట్ల తాటి, ఈత చెట్లను నాటామని మంత్రి గుర్తు చేశారు. హరితహారంలో భాగంగా ఇంకా కోట్లాది తాటి, ఈత మొక్కలను ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ వర్షా కాలంలో నాటతామని మంత్రి తెలిపారు