రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు ముఖ్యమంత్రి. ఆయన మాటకు తిరుగు లేదు. అయినప్పటికీ కొన్ని పరిమితులు ఉంటాయి. అవెలా ఉంటాయనటానికి తాజా ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో మాయదారి రోగానికి చికిత్స ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే ఇస్తాయని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు.ఈ అంశం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.
అలాంటిది తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మాయదారి రోగానికి ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్స అందించేందుకు ఓకే చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో గాంధీ.. చెస్టు.. కింగ్ కోఠి.. సరోజినీ దేవి.. టిమ్స్ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే బాధితులకు వైద్యాన్ని అందిస్తున్నారు. అందుకు భిన్నంగా ఇకపై ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ వైద్యాన్ని అందించేందుకు సర్కారు ఓకే చెప్పేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఎందుకిలా అంటే?దానికి కారణం లేకపోలేదు. లాక్ డౌన్ తో పాటు ఇతర కారణాలతో ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బాగా తగ్గిపోయాయి. ఇలాంటివేళ.. ఆసుపత్రుల నిర్వహణ కష్టం కావటంతో పాటు.. వాటి నుంచి ఒత్తిడి విపరీతంగా ఉందంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చిందంటున్నారు. దీనికి తోడు..రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. అలాంటివేళ.. ప్రైవేటు ఆసుపత్రులు సైతం మాయదారి రోగానికి తగ్గట్లుగా తమను తాము మార్చుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మాయదారి వైద్యానికి సరిపోయేలా ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేయాలని డిసైడ్ చేశారు. ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాయదారి రోగానికి చికిత్స అందించాలంటే సదరు ఆసుపత్రులు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై తాజాగా మార్గదర్శకాల్ని జారీ చేశారు. మొన్నటి వరకూ ప్రైవేటు వైద్యానికి ససేమిరా అన్న కేసీఆర్ సారూ.. ఇప్పుడు అందుకు భిన్నంగా అధికారిక నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. దీంతో.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.