ఏపీలో టీచర్ నుండి ఐదుగురికి కరోనా..అందులో మూడేళ్ళ చిన్నారికి!

Update: 2020-04-11 09:50 GMT
విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేటకు చెందిన ఉపాధ్యాయుని , అతని  ద్వారా మరో ఐదుగురికి కరోనా సోకినట్టు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. వేంపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆయన లాక్‌ డౌన్‌ కారణంగా సెలవులు ప్రకటించడంతో తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో గల అత్తవారింటికి వెళ్లారు. అయితే , అక్కడికి వెళ్లినప్పటి నుండి  జ్వరంతో బాధపడుతున్న సదరు ఉపాధ్యాయుడికి కరోనా వైరస్‌ సోకినట్టు గురువారం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడి బంధువులు, అతడితో సన్నిహి తంగా మెలిగిన 38 మంది నుంచి శాంపిళ్లు సేకరించి శుక్రవారం కాకినాడ జీజీహెచ్‌లో పరీక్షలు జరపగా వారిలో  ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది.

ఇందులో ఉపాధ్యాయుడి రెండో కుమార్తె ఉంది. ఆమె వయస్సు 8 ఏళ్లు. అలాగే  ఆమె తమ ఇంటిపక్కనే వున్న మూడేళ్ల పాపతో ఆడుకో వడానికి వెళుతుండేది. ఇప్పుడు ఆ చిన్నారికీ కరోనా వైరస్‌ సోకింది. అలాగే చిన్నారి తల్లి (28), నానమ్మ(50)కు కూడా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. అదేవిధంగా తరచూ ఉపాధ్యాయుడి అత్తారింటికి వచ్చే దగ్గరి బంధువు అయిన  మహిళ కు పాజిటివ్‌ తేలింది. అయితే వీరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినప్పటికీ లక్షణాలు పెద్దగా లేవని, దీనితో జిల్లా కరోనా ఆసుపత్రిగా గుర్తించిన రాజమహేంద్రవరం సమీపంలోని జీఎస్‌ ఎల్‌ ఆస్పత్రికి తరలించారు.

ఇక గురువారం కరోనా నిర్ధారణ అయిన ఉపాధ్యాయుడిని విమ్స్‌ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. కరోనా నిర్ధారణ అయిన ఉపాధ్యాయుడికి కత్తిపూడిలో చికిత్స చేసిన ఆర్‌ ఎంపీ వైద్యుడిపై జిల్లా కలెక్టర్‌ చర్యలకు ఆదేశించారు. సదరు ఆర్‌ ఎంపీ ఆసుపత్రి శారదా క్లినిక్‌ ను సీజ్‌ చేశారు. శారదా క్లినిక్‌ లో నిర్వహిస్తున్న మెడికల్‌ షాపును కూడా మూసివేశారు. ఎస్‌ ఎల్‌ డయగ్నోసిస్‌ పేరుతో నిర్వహిస్తున్న ల్యాబ్‌ ను కూడా  సీజ్‌ చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయుడిని చేర్చుకుని సమాచారం ప్రభుత్వానికి తెలియజేయనందుకు కాకినాడలోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రిని కూడా సీజ్‌ చేశారు. కాగా విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి కత్తిపూడిలో గల అత్తారింటికి వెళ్లిన ఉపాధ్యా యుడికి అసలు వైరస్‌ ఎక్కడి నుంచి వ్యాపించిం దనేది తేలడం లేదు.వైరస్‌ సోకిన ఉపాధ్యాయుడు ముందు నుంచి లక్షణాలు వున్నప్పటికీ బయటకు తెలియకుండా జాగ్రత్త పడడం.. ప్రైవేటు ఆస్పత్రి లో వైద్యం చేయించుకోవడానికి యత్నించడం వంటివి చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడి పై కేసు నమోదు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
Tags:    

Similar News