చైనా తో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత దేశంలోకి కూడా ప్రవేశించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఒక విద్యార్థినికి కరోనా వైరస్ సోకినట్టు గా తెలుస్తోంది. చైనాలోని వూహాన్ లో చదువుతూ ఇండియాకు వచ్చిన ఈ కేరళ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. భారత దేశంలోనే మొట్టమొదటి కేసుగా చెప్తున్నారు.
ఇప్పటికే కేంద్రంతోపాటు రాష్ట్రాల్లోనూ ‘కరోనా’ వైరస్ పై అలెర్ట్ ప్రకటించారు. ప్రత్యేక వార్డులు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించారు. చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థి ని ప్రస్తుతం దూరంగా ఉంచి ఆమె బంధువులను, కుటుంబ సభ్యులను కలువకుండా ప్రత్యేకంగా చికిత్స చేస్తున్నారు.
చైనా నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా లక్షణాలు ఉండడం తో రక్తనమూనాలు సేకరించి పరీక్షించగా వైరస్ సోకినట్టు పాజిటివ్ వచ్చింది. దీంతో అతడిని ఆస్పత్రి లో ఒంటరి గా ఉంచి రోగిని వైద్యులు ప్రత్యేకం గా చికిత్స చేస్తున్నారు. కేరళ ఆరోగ్య మంత్రి శైలజ సమీక్షిస్తున్నారు.
కాగా చైనా నుంచి వచ్చిన విద్యార్థులను పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం కేరళ లో ముగ్గురికి వివిధ ఆరోగ్య కేంద్రాలలో రహస్యంగా చికిత్స చేస్తున్నట్టు తెలిసింది. ఇక విమానాశ్రయాలలోనూ వైద్యులు ప్రత్యేకం గా పరీక్షలు చేస్తూ లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు.