ఏపీ అప్డేట్..తగ్గుతున్న కరోనా!

Update: 2020-04-10 08:10 GMT
ఏపీలో కరోనా ఉధృతి పై తాజాగా వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నివేదికతో ఏపీ ప్రజలకు ఊరట లభించింది. గురువారం రాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు జరిగిన టెస్టుల్లో కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. ఈ రెండూ కూడా అనంతపురం జిల్లాలోనే నమోదయ్యాయి.

ఏపీ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఉదయం 10 గంటలకు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 365కు చేరుకున్నాయి. వీరిలో 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరుగురు ఇప్పటివరకు ఏపీలో మృతి చెందారు.

జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా అనంతపురం జిల్లాలో 15 మంది - చిత్తూరు లో 20 మంది - కడపలో 29 మంది - ప్రకాశం 38 - నెల్లూరు 48 - కర్నూలులో 75 కేసులు - వెస్ట్ గోదావరి 22 కేసులు - విశాఖ 20 కేసులు నమోదయ్యాయి.

ఇక గురువారం ఏపీలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 11 - గుంటూరులో 2 - కడప - తూ.గోదావరిలో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ నిర్ణారణ అయ్యింది. ఒక్కరోజులోనే ప్రకాశం జిల్లాలో 11 కేసులు నమోదు కావడం కలకలం రేపింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ఆ ఇంట్లోని వ్యక్తికి ఇంతకుముందే పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే ఇస్లాంపేటకు ఏడు పాజిలివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక గుంటూరు జిల్లాలో కరోనాతో తొలి మరణం సంభవించింది. నరసరావుపేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి గురువారం మృతిచెందాడు. కేబుల్ బిల్ వసూలు చేసే అతడికి 6న కరోనా సోకింది. క్షయ వ్యాధి కూడా అతడికి ఉండడంతో తీవ్రమై మరణించాడు.

కృష్ణ జిల్లాలో వైరస్ తో చనిపోయిన వ్యక్తి సోదరుడు కూడా మృతిచెందాడు.  విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన ఒక ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. అతడిని విశాఖకు తరలించారు. కడప జిల్లా మైదుకూరులో మహిళకు కరోనా పాజిటివ్ నిర్ణారణ అయ్యింది. ఢిల్లీ వెళ్లొచ్చిన కొడుకు ద్వారా ఆమెకు కరోనా అంటింది. చిత్తూరులో 23 ఏళ్ల యువకుడు కరోనా నుంచి కోలుకున్నాడు. నెగెటివ్ రావడంతో డిశ్చార్జి చేశారు.



Tags:    

Similar News