కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో కరోనా అలజడి..

Update: 2020-03-17 13:10 GMT
కరోనా వైరస్  ఈ పేరు వింటేనే ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఈ పరిస్థితుల లో దగ్గు, జలుబు ఉన్నవారి దగ్గరికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వైద్యులు - పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ కరోనా తన పంజా విసురుతోంది. ఇకపోతే, కర్నూలు జిల్లా హెడ్ కానిస్టేబుల్ కుమారుడు కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అతను ఇటీవలే విదేశాల నుంచి రావడం.. లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు.

అక్కడినుంచి వచ్చినప్పటీ నుంచి అతను అస్వస్థతతో ఉన్నాడు. దగ్గు - జలుబు రావడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని భావిస్తున్నారు. రక్త నమూనాలను తిరుపతి ఆస్పత్రికి పంపించారు. రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే వైరస్ సోకిందని భావిస్తోన్న తరుణంలో హెడ్ కానిస్టేబుల్ జిల్లా పోలీసు కార్యాలయంలో విధుల్లో భాగంగా తిరిగారు. అయితే కుమారుడు అస్వస్థతగా ఉన్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ అతనితో ఉన్నాడు. ఆస్పత్రిలో కూడా చేర్పించాడు. దీంతో వైరస్ కానిస్టేబుల్‌ కు కూడా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ అతను విధుల్లో భాగంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాయానికి వచ్చేవారు. చాలా మందితో మాట్లాడటంతో... మిగతావారికి కూడా వైరస్ ప్రబలిందా అనే అనుమానం కలిగింది. విషయం బయటకు పొక్కడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కర్నూలు ఎస్పీ ఫకీరప్ప మున్సిపల్ సిబ్బందిని పిలిపించారు. రసాయనాలతో కార్యాలయం మొత్తాన్ని శుభ్రం చేయించారు. ప్రతీ నిత్యం పదుల సంఖ్యలో ఉండే కార్యాలయం ఇప్పుడు ఎవరూ లేకుండా బోసిపోయింది. కర్నూలులో మొత్తం 8 మందికి కరోనా వైరస్ టెస్ట్ చేశారు. అందులో ఇద్దరికీ నెగిటివ్ అని వచ్చింది. మరో ఆరుగురి రిపోర్టులు రావాల్సి ఉంది.
Tags:    

Similar News