కరోనా ఎఫెక్ట్: చైనాకే కాదు ప్రపంచానికి భారీ నష్టం

Update: 2020-02-11 11:30 GMT
చైనాలో పుట్టిన ‘కరోనా’ వైరస్ దెబ్బకు ఆ దేశం విలవిలలాడుతోంది.. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. ఈ వైరస్ కారణంగా తాజాగా చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.  ఆ దేశంలో చాలా కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేస్తున్నాయి.

తాజాగా కరోనా వైరస్  విస్తరించిన కారణంగా 11 రాష్ట్రాల్లో సెలవులను మళ్లీ పొడిగించారు.   దేశంలో ఉత్పత్తి అయ్యే వాహనాల్లో 75శాతం ఈ రాష్ట్రాల్లోనే తయరవడంతో ఆటోమొబైల్ రంగం కుదేలైంది. 3.5లక్షల యూనిట్ల వాహనాల ఉత్పత్తి తగ్గిపోయింది. దీనివల్ల చైనాలో విడిభాగాలు, వాహనాల కొరత తీవ్రంగా ఉండి నష్టం కోట్లలో వస్తోందట..

కరోనా వైరస్ కారణంగా విమానయాన రంగం కూడా చైనాలో కుదేలైంది. హాంకాంగ్ ఎయిర్ లైన్స్ ఏకంగా 400 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. మిగలిన వారిని సెలవు పెట్టాలని సూచించిందట.. ప్రపంచంలోనే నంబర్ 2 విమానయాన సంస్థల్లో హాంకాంగ్ రెండోది.

చైనాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం హ్యుండాయ్ వెహికల్ కాంప్లెక్స్ ను తాజాగా ఆ కంపెనీ మూసివేసింది. సంవత్సరంలో 14 లక్షల వాహనాలు తయారు చేస్తారు.  ఈ కంపెనీ కరోనా వైరస్ కారణంగా మూతతో ఉద్యోగులంతా రోడ్డున పడ్డారు. దాదాపు 25వేల మంది కార్మికులను సెలవులపై పంపారు.

ఇక చైనాలోని తమ ప్లాంట్ల ను కూడా మూసివేస్తున్నట్టు తాజాగా టయోటా, సుజుకి కూడా తెలుపడంతో ప్రపంచవ్యాప్తంగా కార్లు, వాటి విడిభాగాల పంపిణీకి విఘాతం ఏర్పడింది. చైనాలో కరోనా వైరస్ కారణంగా చాలా పరిశ్రమలు మూతపడి ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

    

Tags:    

Similar News