వీడియో: ఊపిరితిత్తుల్లో కరోనా విధ్వంసం ఇలా..

Update: 2020-04-12 12:53 GMT
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఎంతో మందిని కబళిస్తోంది. మనుషుల ప్రాణాలు తీస్తోంది. అసలు ఇది ఎలా సోకుతుంది? ఎక్కడ మనల్ని దెబ్బ తీస్తుంది.? ఎలా మన ప్రాణాలు పోతాయి?  అనేది తాజాగా పరిశోధకులు నిగ్గుతేల్చారు. ఈ మేరకు కరోనా వైరస్ పై విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. ‘న్యూక్లియస్ మెడికల్ మీడియా’ రూపొందించిన ఈ వీడియోలో కరోనా మన ఊపిరితిత్తులకు ఎలా చేరుతుంది? మనకు శ్వాస ఆడకుండా చేసి ఎలా చంపేస్తుంది? దాన్ని మనం ఎలా ఎదుర్కొంటున్నామన్నది క్లియర్ గా చూపించారు.

తాజా పరిశోధనల ప్రకారం కరోనా ఎలా వ్యాపిస్తుంది? ఏఏ ప్రదేశాల్లో మనగగలుగుతుంది. ఎలా రూపు మార్చుకుంటుందో కూడా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రయాణం చేయగలదని.. గాలిలో ఎగరగలదని.. అందుకే ఇంతమందికి సోకుతుందని చైనా పరిశోధకుల స్టడీలో తేలింది. వారు వెల్లడించిన షాకింగ్ విషయాలు ఇలా ఉన్నాయి..దీన్ని అమెరికాలోని సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) జర్నల్ లో పబ్లిష్ చేశారు.

*చైనా పరిశోధనలో తేలిన నిజాలివీ


*కరోనా వైరస్ వ్యక్తి నుంచి 13 అడుగుల దూరం.. అంటే 4 మీటర్ల వరకు ప్రయాణించగలదని కరోనా పుట్టి విస్తరించిన వూహాన్ ఆస్పత్రుల్లో చేసిన తాజా అధ్యయనంలో తేలింది.

* కరోనా ఆస్పత్రుల్లో నేలపైన.. వైద్య సిబ్బంది బూట్లు - కంప్యూటర్లు - మౌస్ లు - పడకలు - తలుపు గడియలపైనే ఎక్కువగా వైరస్ కనిపించినట్టు తెలిపారు.

*ఇక కరోనా రోగి దగ్గులు - తుమ్మల ద్వారా 13 అడుగుల వరకు వ్యాపించాయి. కొన్ని 8 అడుగుల ఎత్తువరకు వెళ్లాయి.

*మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం 2 మీటర్లు పాటించాలని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. అయితే తాజా సర్వేలో కనీసం 4 మీటర్లు దూరం ఉండాలని తేలింది.

*దీన్ని బట్టి తుమ్ములు - దగ్గుతో బాధపడేవారికి సమీపంలో ఉండకపోతేనే బెటర్ అని పరిశోధకులు చెబుతున్నారు.

Full View
Tags:    

Similar News