వణికిస్తున్న కరోనా.. అంతకంతకూ విస్తరిస్తోంది. మందుగా వేసుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా తీవ్రత పెరగటమే కాదు.. దీని కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. చైనాలో కరోనా కారణంగా రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. స్టేడియంలను ఆసుపత్రులుగా మారుస్తూ వైద్య సేవల్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనా వైరస్ కు కేంద్రస్థానమైన వూహాన్ మహానగరంలోని హోంగ్ షాన్ స్టేడియంను ఆసుపత్రిగా మార్చారు. వైరస్ బారిన పడిన వారి కోసం పెద్ద ఎత్తున మంచాలు.. వైద్య సామాగ్రిని సిద్ధం చేశారు. గడిచిన 24 గంటల్లో హుబెయ్ ప్రావిన్సులో 64 మంది చనిపోయారు. దీంతో ఈ వైరస్ కారణంగా చైనాలో మరణించిన వారి సంఖ్య 425కు చేరగా.. ఒక్కరోజులో 3235 మందిలో కొత్త కేసుల్ని గుర్తించారు. మరో 5,072 మందిలో వైరస్ ఉందన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా కరోనా వైరస్ అనుమానంతో వైద్యుల పరిశీలనలో ఉన్న వారి సంఖ్య 1.71లక్షలమంది కావటం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా కరోనా 26 దేశాల్లో విస్తరించి.. మిగిలిన దేశాలకు వణుకు పుట్టేలా చేస్తోంది. చైనా తర్వాత అత్యధిక కేసులు సింగపూర్ లో 24.. జపాన్ లో 20.. థాయ్ లో 19.. దక్షిణ కొరియాలో 16.. ఆస్ట్రేలియాలో పన్నెండు.. జర్మనీ పన్నెండు.. అమెరికాలో పదకొండు.. మలేషియా.. తైవాన్.. వియత్నాంలో పది చొప్పున కేసులు నమోదయ్యాయి. భారత్ లో మూడు కేసులు నమోదయ్యాయి. అవన్నీ కేరళకు చెందిన వారే కావటం గమనార్హం. మిగిలిన దేశాల్లో సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యాయి.
జపాన్ లో డైమండ్ ప్రిన్సెస్ అనే విహార నౌకలో ప్రయాణిస్తున్న 3711 మందిని కరోనా వైరస్ భయంతో విడిగా ఉంచేశారు. ఇందులో ప్రయాణించిన ఒక వ్యక్తి హాంకాంగ్ లో వైద్య పరీక్షలు నిర్వహించగా.. అస్వస్థత బయటపడటంతో ఆ నౌకను సముద్రంలోనే ఉంచేశారు. ఈ నౌకను ఒకట్రెండు రోజులు జపాన్ లోనే నిలిపివేయనున్నారు.
చైనాలో వైరస్ తీవ్రత ఎక్కువైన నేపథ్యంలో చైనీయులకు భారత్ కు వచ్చేందుకు వీలుగా జారీ చేసే వీసాల విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది. చైనీయులకు వీసాలు ఇవ్వటంలోనే కాదు.. చైనా వెళ్లిన ఇతర దేశీయులకు వీసాలు ఇవ్వకుండా రద్దు చేసింది. భారత్ కు రావాలనుకునేవారు తొలుత ఆయా దౌత్య.. కాన్సులేట్ కార్యాలయాల్లో సంప్రదించిన తర్వాతే ప్రయాణం కావాలని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 8 నుంచి ఢిల్లీ - హాంకాంగ్ విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.