విరాళాలు.. బీజేపీ టాప్.. కాంగ్రెస్ ను పట్టించుకోలేదు..

Update: 2018-11-29 08:17 GMT
ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కార్పొరేట్ సంస్థలు పెద్దగా పట్టించుకున్నట్లు కనబడటం లేదు. ఎందుకులా అంటున్నారని అనుకుంటున్నారా.... ఇటీవల ఏయే పార్టీకి ఎన్నెన్ని విరాళాలు అందాయనే దానిపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్(ఏడీఆర్) నివేదిక ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకీ అతి తక్కువ విరాళాలు రావడం గమనార్హం.
 
రాజకీయ పార్టీలకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కార్పొరేట్ సంస్థలు ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా విరాళాలు అందిస్తుంటాయని జగమెరిగిన సత్యం. అయితే ఏడీఆర్ 2017-18 నివేదిక ప్రకారం అన్ని పార్టీలకు కలిపి 194 కోట్ల రూపాయాల విరాళాలు అందాయి. ఈ  నివేదిక ప్రకారం అత్యధిక వాటా అధికార బీజేపీ దక్కింది. 167.80కోట్ల రూపాయలు ఒక్క బీజేపీకే అందాయి.

 ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ సహా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - నేషనల్ కాన్ఫరెన్స్ - బీజు జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీలన్నంటికీ కలిపి కేవలం 25.98 కోట్ల రూపాయాలు విరాళాల రూపేణా అందాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 11కోట్ల రూపాయలు విరాళాలు అందాయని పేర్కొంది. ఇందులో బీజు జనతా దళ్ పార్టీకి 14కోట్లు వాటాగా దక్కాయి. ఒక ప్రాంతీయ పార్టీ కంటే కాంగ్రెస్ కు తక్కువ మొత్తంలో రావడం చర్చనీయాంశంగా మారింది.

ఎలక్ట్రోరల్ ట్రస్టులకు విరాళాలు అందించిన టాప్ 10మంది దాత వివరాలను కూడా ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 25.005కోట్ల రూపాయలు అందించింది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ ఎఫ్ 25కోట్లు - యూపీఎల్ లిమిటెడ్ 20కోట్లు అందజేశాయని నివేదికలో పేర్కొంది.

ఒకపక్క అసెంబ్లీ ఎన్నికలు - మరోపక్క లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఒక జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీ కంటే తక్కువ మొత్తంలో విరాళాలు రావడం ఏంటనీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ అయినా స్పందించాల్సి ఉంది.
Tags:    

Similar News