హైదరాబాదీయులకు స్వీట్ న్యూస్ చెప్పేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. మెట్రో రైలు మొదటి దశలో చివరిదైన జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబస్ మధ్యనున్న 11 కి.మీ. మెట్రో మార్గాన్ని ఈ నెల ఏడున ప్రారంభించనున్నట్లుగా వెల్లడించారు. సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మార్గానికి పచ్చజెండా ఊపుతారని కేటీఆర్ వెల్లడించారు.
తాజా ప్రకటనతో దేశంలో ఢిల్లీ తర్వాత అతి పెద్ద మెట్రో మార్గం ఉన్న మహానగరం జాబితాలో హైదరాబాద్ చేరుతుంది. ఇప్పుడు అందుబాటులోకి రానున్న పదకొండు కిలోమీటర్ల మార్గంతో హైదరాబాద్ మెట్రో నిడివి 69 కిలోమీటర్లకు చేరుకోనుంది. మెట్రో రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు.. ఇతర మార్గాలతో పాటు.. పాతబస్తీకి మెట్రో పై కీలక ప్రకటన వచ్చే వీలుందని చెబుతున్నారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చే పదకొండు కి.మీ. మార్గంలో మొత్తం తొమ్మిది స్టేషన్లు ఉంటాయి. రోడ్డు మార్గంలో ప్రయాణానికి తక్కువలో తక్కువ 30 నిమిషాలు పడితే.. ట్రాఫిక్ అధికంగా ఉండే వేళలో గంటబావు పడుతుంది. మెట్రో తో ఈ దూరాన్ని కేవలం 18 నిమిషాల్లో చేరుకునే వీలుంది.
ఇక.. కేటీఆర్ చేసిన ట్వీట్ లో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇప్పటివరకూ మెట్రోను ప్రారంభించింది ప్రధాని మోడీ అన్న విషయం తెలిసిందే. నాడు ప్రధాని వెంట సీఎం కేసీఆర్ మెట్రోలో ప్రయాణించారు. ఆ తర్వాత పలు మార్గాల్లో ప్రారంభోత్సవాలు జరిగినా.. వేటిలోనూ సీఎం కేసీఆర్ పాల్గొన్నది లేదు. గవర్నర్ నరసింహన్.. మంత్రి కేటీఆర్ పాల్గొనేవారు. అందుకు భిన్నంగా తాజా ప్రారంభోత్సవానికి మాత్రం సీఎం కేసీఆర్ పాల్గొనటం విశేషం. తాజా ప్రారంభోత్సవంలో మెట్రో రెండో దశకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే వీలుందని.. ఈ కారణంతోనే సీఎం కేసీఆర్ హాజరవుతున్నట్లుగా భావిస్తున్నారు.