సీఎం జ‌గ‌న్‌కు స‌మ‌న్లు.. కోర్టుకు రావాల‌ని ఆదేశం.. రీజ‌న్ ఇదే

Update: 2022-03-24 09:30 GMT
ఏపీ సీఎం జగన్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేయడం సంచలనమైంది. ఏపీ సీఎం ను ఈనెల 28న సోమవారం విచారణకు విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సమన్లు జారీ చేయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

దాదాపు 7 ఏళ్ల క్రితం నాటి ఓ కేసుకు సంబంధించి కోర్టు సమన్లు జారీ చేసింది. 2022 మార్చి 28వ తేదీ సోమవారం కోర్టుకు హాజరు కావాలని కోర్టు పేర్కొంది. అయితే జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును ఆయన న్యాయవాదులు కోరే అవకాశం ఉంది.

మరి ఈ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. మొత్తంగా సీఎం జగన్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేయడం మాత్రం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

-సమన్లకు సంబంధించిన కేసు ఇదే..

2014లో హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా సీఎం జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలు ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించారని నాడు కేసు నమోదైంది. జాతీయ రహదారిపై ప్రచారం నిర్వహించడం ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందకు వస్తుందని కేసు పెట్టారు.

అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతూ వస్తోంది. కేసు నమోదైన వారు న్యాయస్థానానికి హాజరై వివరణ ఇవ్వడంతో వారు కేసు నుంచి బయటపడ్డారని సమాచారం.

అప్పటి నుంచి జగన్ కోర్టుకు హాజరుకాకపోవడంతో నాంపల్లి ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిందని తెలుస్తోంది. మరి సీఎం జగన్ న్యాయస్థానం ఎదుట హాజరవుతారా? లేదా? అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News