నెల్లూరును కుదిపేస్తున్న 'కోర్టులో చోరీ' ఘటన

Update: 2022-04-16 10:33 GMT
నెల్లూరు జిల్లా కోర్టులో దొంగలు పడి అధికార పార్టీ మంత్రికి చెందిన కేసు తాలూకా పత్రాలు చోరీ కావడం సంచలనమైంది. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చొరబడ్డారు. గురువారం ఉదయం కోర్టుకు వచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారు.  

నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇది పెనుదుమారం రేపింది. అధికార పార్టీ నేత ఇటీవల బాధ్యతలు చేపట్టగానే జరిగిన ఈ ఉదంతం పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగింది. దీనిపై చాలా మంంది ఆందోళన బాట పట్టారు.

తాజాగా నెల్లూరు జిల్లా కోర్టు భవనాల సముదాయం వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయవ్యవస్థను కాపాడాలంటూ నినాదాలు చేశారు. దొంగల బారి నుంచి న్యాయవ్యవస్థను కాపాడాలని కోరారు.  దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారని న్యాయవాదులు తెలిపారు.

'అనామక దొంగలను అరెస్ట్ చేయడం కాదని.. చోరీకి పాల్పడిన అసలు దొంగలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఓ ప్రజాప్రతినిధి ముద్దాయిగా ఉన్న కేసు ప్రాపర్టీ చోరీకి గురైందని.. వందల కేసులు ఉండగా.. ఈ ఒక్క కేసు పత్రాలే ఎందుకు దొంగిలించారని న్యాయవాదులు ఆరోపించారు. చోరీ ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్చేశారు.

భారతదేశ చరిత్రలో ఇలాంటి చోరీ జరగలేదని.. కేసుపత్రాలు దొంగిలించడం దురమ్ార్గమైన చర్య అని న్యాయవాదులు పేర్కొన్నారు.  కోర్టులోనే చోరీ జరిగితే.. ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలని న్యాయవాదులు ప్రశ్నించారు.

-కోర్టులో ఏం దొంగిలించారంటే?

నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో కొందరు వ్యక్తులు చొరబడ్డారు. ఓ బ్యాగును ఎత్తుకెళ్లి.. కోర్టు బయట ఉన్న కాలువలో పడేశారు. పోలీసులు దానిని పరిశీలించగా.. అందులో పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. కోర్టులో దొంగతనం జరిగిన మాట వాస్తవమని, దానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, చోరీకి గురైన వాటిలో కొన్ని పత్రాలను..కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. ల్యాప్‌టాప్, 4 మొబైల్‌ ఫోన్లను ఎత్తుకెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అవి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా భావిస్తున్నారు!
Tags:    

Similar News