భారత దేశంలో కరోనా విస్తృతి కొనసాగుతూనే ఉంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్ లో నెమ్మదిగానే వ్యాపిస్తోంది. ఇతర దేశాల్లో కరోనా వారం వారం డబుల్ అవుతుండగా.. భారత్ లో మాత్రం తీవ్రత మెల్లిగా సాగుతోంది. లేట్ అయినా లేటెస్ట్ గా దేశంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య 10వేలకు చేరువ అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం కరోనా కేసుల సంఖ్య దేశంలో 10వేల మార్కును దాటేసింది. వారం కిందటితో పోలిస్తే 10వేల మార్కును అందుకోవడానికి వారం పట్టడం ఊరటనే అని చెప్పవచ్చు.
గడిచిన రెండు మూడు రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీంతో 10వేల డేంజర్ మార్క్ ను అందుకుంది.
సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఏకంగా 1200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఢిల్లీలో ఒక్కరోజే 300 కొత్త కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాల్లోనూ భారీగానే కేసులు ప్రకటించారు.
కాగా దేశంలో గడిచిన 24 గంటల్లోనే దేశం మొత్తం మీద 50 మంది దాకా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
భారత దేశంలో కరోనా మరణాల సంఖ్య 342కు చేరింది. ఇది ప్రమాదకర స్థితినే సూచిస్తోంది. వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని చెప్పవచ్చు. అయితే తగ్గుతుంది. లేదంటే సామూహికంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని లాక్ డౌన్ ప్రకటన ఆసక్తి రేపుతోంది.
*తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఉదయానికి 563 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 17మంది చనిపోయారు. 103 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
*ఆంధ్రాలోనూ పెరుగుదలే..
ఏపీలోనూ కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. మంగళవారం ఉదయం వరకు 439 కేసులు నమోదయ్యాయి. ఏపీ వ్యాప్తంగా కరోనా కారణంగా ఏడుగురు చనిపోయారు. 12 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.