కలవరం: ముంబై మురికివాడలో నలుగురికి కరోనా

Update: 2020-03-27 11:10 GMT
ముంబై మురికివాడలో కరోనా కలకలం చెలరేగింది. ఈ వైరస్ మురికివాడలో తీవ్రంగా వ్యాపిస్తోంది.  ముంబైలో లాక్ డౌన్ తోపాటు కర్ఫ్యూ కూడా విధించడంతో అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉంది.

ముంబై మురికివాడల్లో నలుగురు వ్యక్తులకు తాజాగా కరోనా పాజిటివ్ అని తెలియడంతో కలకలం చెలరేగింది. మురికివాడల్లోని వారు విచ్చలవిడిగా తిరుగుతుంటారు. పనికోసం వెళుతుంటారు. దీంతో వీరు ఎంతమందికి అంటించారనే విషయం తలుచుకుంటేనే భయంగా మారింది.

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలున్న నగరం ముంబై. దాదాపు 175కి.మీల పొడవున ఉండే ముంబైలో మురికివాడల్లో కరోనా సోకితే మరణ మృందంగం వినిపించడం ఖాయం. పరేల్ లోని చాల్ నివాసం ఉంటున్న కాలినా (65)  అనే వ్యక్తితో పాటు జంబ్లిపాడ మురికివాడలో నివాసం ఉంటున్న 35ఏళ్ల మహిళకు, ఘాట్ కోపర్ లోని 25 ఏళ్ల వ్యక్తికి, ఇదే మురికివాడకు చెందిన మరో మహిళకు వైరస్ లక్షణాలు కనిపించాయి.

కరోనా సోకిన వృద్ధురాలు ఫుడ్ వ్యాపారం చేసేది. ఈమె వద్దకు ఎంతో మంది వచ్చి ఆహారం తీసుకెళ్లేవారు వారికి ఎంతమందికి వచ్చిందనేది అనుమానంగా మారింది. ఇక్కడ సోకితే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశాలున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది.

దీంతో ఇది రెండో, మూడో దశకు చేరితే మురికివాడ మొత్తం పాకి పెద్ద ఎత్తున మరణాలు సంభవించడం ఖాయం.


    

Tags:    

Similar News