భారత్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మొన్నటిదాకా అదుపులోనే ఉన్న మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 5,233 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే కేసులో 40 శాతం పెరుగుదల కనిపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా పీడ పోయిందని హాయిగా మాస్కులు తీసేసి, శానిటైజర్ వాడకం తగ్గించేసి, గుంపులు గుంపులుగా తిరుగుతున్న జనంలో మళ్లీ ప్రకంపనలు సృష్టించడానికి మహమ్మారి రెడీ అయింది. మంగళవారం ఒక్కరోజే 5వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా.. ఏడుగురు ఈ మహమ్మారికి బలయ్యారు.
కేంద్ర వైద్యారోగ్య శాఖ బుధవారం రోజున విడుదల చేసిన బులెటిన్‌లో 5,223 మంది కరోనా బారిన పడినట్లు తెలిపింది. మంగళవారం రోజున కొవిడ్‌తో ఏడుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు ఈ మహమ్మారి సోకి మృతి చెందిన వారి సంఖ్య 5,24,715కి చేరింది. నిన్నటితో పోలిస్తే కేసులో 40 శాతం పెరుగుదల కనిపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా 84 శాతం కేసులు అయిదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలో 1,881, కేరళ- 1,494, దిల్లీ-450, కర్ణాటక-348, హరియాణా-227 మంది కరోనా బారినపడినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 3,345 మంది కోలుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,26,36,710కి చేరిందని ప్రకటించింది.
దేశంలో రికవరీ రేటు 98.72%గా ఉండగా.. యాక్టివ్ కేసులు 28,857 ఉన్నాయని పేర్కొంది. భారత్‌లో మంగళవారం 14,94,086 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,43,26,416కు చేరింది. మరో 3,13,361 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
ఇతర దేశాల్లోనూ కరోనా కోరలు చాస్తోంది. చాలా వరకు దేశాల్లో నాలుగో దశ మొదలైనట్లే కనిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 5,42,669 కేసులు వెలుగుచూశాయి. మరో 1510 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 536,473,762కు చేరింది. మరణాల సంఖ్య 6,323,279కు చేరింది. ఒక్కరోజే 650,670 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 507,524,529గా ఉంది.