నిజమే.. ప్రాణం ఎవరికైనా ప్రాణమే. అయితే.. ఈ మాటను మన దేశంలో అర్థం కంటే కూడా అపార్థం చేసుకునే వారే కనిపిస్తారు. మనిషి ప్రాణానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్న మాటకు బాహాటంగా ఎవరు విమర్శించకున్నా.. ప్రైవేటుగా మాత్రం.. నో అంటే నో అనేస్తారు. ఒక సామాన్యుడి ప్రాణానికి.. ఒక వీఐపీ ప్రాణానికి ఒకటే లెక్క ఎందుకు అవుతుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రాన్ని పాలించే అధినేత.. కొవిడ్ ఎవరికి వచ్చినా సరే.. గాంధీకి వెళ్లాలంటూ ఏడాది క్రితం చేసిన వీడియోలు ఈ రోజుకు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటిది.. కొవిడ్ వచ్చిన వేళ.. కార్పొరేట్ ఆసుపత్రి అయిన యశోదాకు వెళ్లారు సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్. అంతే తప్పించి.. పరీక్షల కోసం కూడా గాంధీ ముఖాన్ని చూసింది లేదు. అలాంటప్పుడు వేల మంది కొవిడ్ పేషెంట్లకు చికిత్స చేస్తూ.. అనుకోని రీతిలో వైరస్ బారిన పడిన వైద్యుడికి ఎలాంటి చికిత్స అందాల్సిన అవసరం ఉందంటే.. టాప్ మోస్ట్ ప్రయారిటీతో.. అత్యంత ఖరీదైన వైద్యం ఇవ్వాలన్న మాట వినిపిస్తుంటుంది.
ఎందుకంటే.. సదరు వైద్యుడి బతికితే.. వేల మంది ప్రాణాల్ని కాపాడతాడు. మరి.. అలాంటప్పుడు గాంధీలో వైద్య సేవల్ని అందించే జూనియర్ డాక్టర్లు పాజిటివ్ అయితే.. వారికి వైద్యాన్ని నిమ్స్ లో కల్పించాలని డిమాండ్ చేయటంలో తప్పేమీ లేదు. కానీ.. ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్ కు సానుకూలంగా ఎందుకు స్పందించదన్నది అర్థం కాని ప్రశ్న. ఇప్పటివరకు కరోనా బారిన పడి 39 మంది జూడాలు చనిపోయినట్లుగా చెబుతున్నారు. వైద్య సేవలు అందించి మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తారన్న ప్రశ్నను సంధిస్తున్నారు. అయితే.. నిమ్స్ లో వైద్యం అందించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. జూడాలు ఎవరూ ఆ మాటను ప్రస్తావించకపోవటం గమనార్హం.
తాజాగా తమ డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేని వైనంపై జూడాలు ఆగ్రహం వ్యక్తం చేయటమేకాదు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి కొవిడ్ వస్తే.. యశోదాలో పరీక్షలు చేయించుకుంటారని.. అదే వెయ్యి మంది రోగుల్ని కాపాడే వైద్యుడికి కరోనా వస్తే గాంధీలో పేదలకు ఇవ్వాల్సిన బెడ్స్ పైన చికిత్సలు పొందాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో యశోదాలో పరీక్షలు చేయించుకున్న సీఎం కేసీఆర్ పై పలువురు విమర్శలు చేస్తున్నారు. తాజాగా జూడాలు సైతం ఇదే పంచ్ వేయటం గమనార్హం.