2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాన్ వామపక్షాలతో కలిసి పోటీచేశాడు. బీజేపీ, టీడీపీలను కాలదన్ని కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి ఏపీ రాజకీయ యవనికపై అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే ఆ పొత్తు ఫలించలేదు. జనసేనాని పవన్ సైతం రెండు చోట్ల పోటీచేసి గెలవలేకపోయాడు.
దీంతో తత్త్వం బోధపడిన పవన్ కళ్యాణ్ బీజేపీతో జట్టుకట్టాడు. మతతత్వ పార్టీ అన్న ముద్రను వేసిన పవన్ కళ్యాణ్ యే ఆ పార్టీతో జట్టుకట్టడంపై వామపక్షాలు గతంలోనే తీవ్ర విమర్శలు చేశాయి. చేగువేరా సిద్ధాంతాల పవన్.. తనకు వ్యతిరేకమైన కాషాయ చొక్క తొడుక్కోవడంపై తాజాగా సీపీఎం కార్యదర్శి పి. మధు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీపీఎం కార్యదర్శి పి. మధు తాజాగా పవన్ పై విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ బీజేపి పంచన చేరి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ లేబొరేటరీస్ ఏర్పాటు బీజేపీ ఇక్కడ వ్యతిరేకిస్తూ ఢిల్లీలో మద్దతు పలుకుతోందని ఆయన విమర్శించాడు.
బీజేపీ, జనసేన పార్టీలు నంగనాచి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సీపీఎం మధు విజ్ఞప్తి చేశారు. దివిస్ పరిశ్రమను అక్కడి నుంచి తరలించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు.
స్థానికులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని.. జైలులో ఉన్న వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మధు డిమాండ్ చేశారు.