ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు! అనంతరం ఆమె మెదడును తినేశాడు! ఆ తర్వాత భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి సంచుల్లో నింపి దూరంగా పడేశాడు! ఈ ఒళ్లు గగుర్పొడిచే సంఘటన మెక్సికోలో వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... మెక్సికోలోని ఫ్యూబ్లా నగరంలో నివసించే 32 ఏళ్ల అల్వారోకు 38 ఏళ్ల మరియా మోంట్ సెరాట్ తో వివాహం అయ్యింది. అయితే వివాహం సమయానికే ఆమెకు ఐదుగురు పిల్లలు ఉండటం గమనార్హం. వారి వయసు 12 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉంటుందని తెలుస్తుంది. అయితే అల్వారోకు మరియా మెంట్ సెరాట్ తో పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదని అంటున్నారు.
ఇంతలో ఏమైందో ఏమో కానీ.. తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి ఆమె బ్రెయిన్ ని తినేశాడు అల్వారో. అనంతరం ఆమె పుర్రెను యాష్ ట్రే గా వాడుతున్నాడంట. ఇక మిగిలిన శరీర భాగాలను సంచుల్లో నింపి ఇంటి వెనుక భాగంలో పాడేశాడని పోలీసులు గుర్తించారు. అయితే ఈ విచారణ సందర్భంగా నిందితుడు వెళ్లడించిన వివరాలు, హత్యకు గల కారణాలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి!
అవును.. శాంటా ముర్టే అనే దయ్యం ఆదేశాల మేరకు తన భార్య మరియాను హత్య చేసినట్లు అల్వారో అంగీకరించాడని తెలుస్తుంది. దెయ్యం చెప్పడం వల్లే తాను తన భార్యను చంపినట్లు అతడు వాదిస్తున్నాడంట. హత్య తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడట.
అయితే భార్యను చంపిన విషయాన్ని ఆమె కుమార్తెల్లో ఒకరికి ఫోన్ చేసి చెప్పినట్లు మరియా తల్లి మరియా అలీసియా మోనిటెల్ సెర్రాన్ వెల్లడించారట.
ఇదే సమయంలో అల్వారో దయ్యానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాల్లో పెట్టేవాడని పోలీసులు గుర్తించారని తెలుస్తుంది. అదేవిధంగా... అతని ఇంట్లో చేతబడికి సంబంధించిన కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
అతడు డ్రగ్స్ కు బానిస కావడం వల్ల మానసిక సమస్యలు ఎదుర్కొనే వాడని... అతని కాలుమీద దయ్యానికి సంబంధించిన పచ్చబొట్టు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు! ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది!