నిమ్మగడ్డకు సీఎస్ లేఖ.. ఏం రాశాడంటే?

Update: 2021-01-25 14:20 GMT
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన వివాదం ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడింది. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు.. ఏపీ ప్రభుత్వానికి మధ్య వైరంతో ఎన్నికల నిర్వహణకు ఇన్నాళ్లు అడ్డంకులు ఏర్పడ్డాయి. కానీ తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏపీ సర్కార్ కు ఏర్పడింది.

తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికలకు సహకరించే విషయంపై కొద్దిసేపటి క్రితమే సీఎం వైఎస్ జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ప్రభుత్వ సీఎస్ ఆదిత్యనాథ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారని సమాచారం. ఈ ఫైట్ లో జగన్ సర్కార్ వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

గత ఏడాది మార్చిలో జరగాల్సిన పంచాయితీ ఎన్నికలను ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు నిర్వహిద్దామంటే ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు మరోసారి ఏపీలో జరుగనున్నాయి.
Tags:    

Similar News