ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. శుక్రవారం రాత్రి ముంబై తో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని ప్లే ఆఫ్స్ ఆశలు పూర్తిగా మూసేసుకుంది. చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులే చేయగా ముంబై ఒక్క వికెట్ కూడా పడకుండా ఆడుకుంటూ పాడుకుంటూ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయం తో ముంబై మళ్లీ అగ్ర స్థానానికి చేరింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. స్యామ్ కరన్ (47 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ తప్ప మిగిలిన అందరూ విఫలమయ్యారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రెంట్ బౌల్ట్ (4/18) చెన్నై జట్టుని కకావికలం చేశాడు. అతడు వరుసగా వికెట్లు తీయడంతో చెన్నై ఇక కోలుకోలేకపోయింది.రుతురాజ్ గైక్వాడ్ (0), జగదీశన్ (0) డకౌట్ కాగా, ఎమ్మెస్ ధోని (16 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్), రాయుడు (2), డుప్లెసిస్ (1), జడేజా (7) వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టారు.
అనంతరం 115 పరుగుల లక్ష్యాన్ని ముంబై 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (37 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెన్నై బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా కిషన్ బౌండరీలతో చెలరేగాడు.
రెండో ఓవర్లోనే ధోనీ బ్యాటింగ్ కి
వరుసగా వికెట్లు పడటంతో ధోనీ ఐపీఎల్ కెరీర్‌లో రెండోసారి మాత్రమే రెండో ఓవర్లోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. బుమ్రా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టినా ధోనీ కూడా ఎక్కువసేపు క్రిజ్ లో నిలవలేదు. లెగ్‌స్పిన్నర్ రాహుల్ చహర్ చక్కటి బంతితో ధోని ని ఔట్ చేశాడు.
సామ్ కరన్ హైలెట్
చెన్నై జట్టులో సామ్ కరన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో ఓవర్ మూడో బంతికి క్రీజ్‌లోకి వచ్చిన అతను చివరి బంతి వరకు పట్టుదలగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. బౌల్ట్ వేసిన 20వ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన కరన్ 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ముంబై ప్లే ఆఫ్స్ కి
వరుస విజయాలతో అగ్ర స్థానానికి చేరుకున్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు కన్ఫర్మ్ చేసుకుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఢిల్లీ, బెంగళూరు జట్లు దాదాపు కూడా ప్లే ఆఫ్స్ చేరుకున్నట్లే. నాలుగో స్థానం కోసం కోల్‌కత్తా, హైదరాబాద్, పంజాబ్ పోటీ పడుతున్నాయి.