వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నల్గొండ జిల్లా అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్టుగా ఉండేది. జానారెడ్డి అంత సీనియర్ అయినా.. వైఎస్ఆర్ వ్యతిరేక గ్రూపులో ఉన్నాడు కాబట్టి 2009లో వైఎస్ఆర్ మళ్లీ రెండోసారి సీఎం అయిన తరువాత జానారెడ్డికి మంత్రిపదవి కూడా ఇవ్వలేదు. అంతా కోమటిరెడ్డి బ్రదర్స్ కే పెత్తనం ఇచ్చాడు. కోమటిరెడ్డి వర్గం ఆ జిల్లాలో దాదాపు 70శాతం ఉండేది. ఆ తరువాత వైఎస్ఆర్ చనిపోయిన తరువాత కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం పడిపోయింది.
సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి అయిన తరువాత నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే 1989లో మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యి ఇద్దరూ క్లోజ్ గా ఉండే వారంట.. ఆ తరువాత తెలంగాణ ఏర్పాటైన తరువాత మొన్నటి 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అయితే పట్టు వీడకుండా 2019 లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటి ఎంపీగా గెలిచాడు. ఎంపీగా గెలిచిన తరువాత ఆర్థికంగా బలమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ పదవి తనకు ఇస్తే నేను కేసీఆర్ మీద ప్రతాపం చూపిస్తాని ఎన్నో సందర్భాల్లో అధిష్టానం దగ్గర విజ్ఞప్తులు చేశాడు. బహిరంగంగానే అదే మాట అన్నాడు.
అయితే తెలంగాణ ప్రజల్లో ఇమేజ్ లేని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైకమాండ్ అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే టాక్ ఉంది. సీడబ్ల్యూసీలోకి తెలంగాణ నుంచి రెడ్డి సామాజికవర్గం నేతలను తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించిందంట.. జానారెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరిలో ఒకరిని తీసుకోవాలని అనుకుందంట.. అయితే జానారెడ్డి ఈ మధ్య వయసు రీత్యా అంత యాక్టివ్ గా లేడని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీడబ్ల్యూసీలోకి తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో ఆర్థికంగా ఆదుకుంటాడని భావిస్తోందట.. అంతేకాకుండా రెడ్డి సామాజికవర్గాన్ని కూడా సంతృప్తి పరచవచ్చని అనుకుంటున్నారట..
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున కుల పరంగానే ఎన్నికలు జరుగుతాయని.. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ఓట్లు టీఆర్ఎస్ కు వెళ్లకుండా చేయాలంటే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ఇద్దరినీ సంతృప్తి పరిస్తే మిగతా వాళ్లు అందరినీ వాళ్లు సర్దుబాటు చేసుకుంటారని హైకమాండ్ భావిస్తోందట.. కోమటిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చినట్టు ఉంటుందని.. త్వరలో హైకమాండ్ నుంచి పిలుపు వస్తుందని భావిస్తున్నారు.