ఖాకీలనూ వదలని సైబర్ నేరగాళ్లు..ఏకంగా డెబిట్ కార్డు ను క్లోనింగ్ చేసి చోరీ

Update: 2020-11-30 13:00 GMT
తలపులు పగలగొట్టడం,  ఇంటికి కన్నం వేయడం వంటి దొంగతనాల కంటే ఇప్పుడు  సైబర్ చోరీలే ఇప్పుడు అధికమయ్యాయి. అంతా ఆన్లైన్ ప్రపంచం గా మారుతున్న ప్రస్తుత తరుణంలో దొంగతనాలు కూడా ఆన్ లైన్ లోనే ద్వారా జరుగుతున్నాయి. దొంగలు  మితిమీరిన తెలివితో జనాన్ని దోచేసుకుంటున్నారు. మన కంటికి కనిపించని మాయగాళ్ళు ఎక్కడ కూర్చుని తమ పని తాము చేసుకుంటూ జనాన్ని దోచేసుకుంటున్నారు. రోజురోజుకో సరికొత్త మోసంతో ముందుకు వస్తున్నారు.

 ఏదైనా చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తాం.. అలాంటిది ఓ పోలీసునే సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి రూ.  నాలుగు రోజుల్లో లక్షా 30 వేలు    దోచేసుకున్నారు.మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ పోలీస్ అధికారి  గత నెలలో ఏటీఎం నుంచి కొంత నగదు డ్రా చేశాడు. ఆ తర్వాత తన స్మార్ట్ ఫోన్ రిపేర్ రావడంతో మొబైల్ షాప్ లో ఇచ్చాడు. అయితే అదే సమయంలో అతడి  ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. లక్షా 30 వేలు   డ్రా చేసుకున్నారు. మొబైల్ రిపేర్ పూర్తయిన తర్వాత నగదు లావాదేవీలకు  సంబంధించి మెసేజులు రావడంతో ఆ పోలీస్ అధికారి డెబిట్ కార్డు క్లోనింగ్ చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన అధికారులు చోరీపై విచారణ చేపట్టారు.

 గత నెలలో  పోలీస్ అధికారి ఓ ఏటిఎం కేంద్రం నుంచి డబ్బు డ్రా చేసిన సమయంలో దుండగులు డెబిట్ కార్డును క్లోనింగ్ చేసినట్టు గుర్తించారు.  ఆ తర్వాత వారు నవంబర్ ఒకటో తేదీ నుంచి 4వ తేదీ మధ్య నగరంలోని వివిధ ఏటీఎం కేంద్రాల నుంచి 33సార్లు నగదును విత్ డ్రా  చేసుకున్నట్లు నిర్ధారించారు. సైబర్ నేరగాళ్లను  పట్టుకునేందుకు ఉన్నతాధికారులు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
Tags:    

Similar News